Srinivas Engagement: బెల్లంకొండ శ్రీనివాస్ కాబోయే భార్యను చూశారా? ఇవాళే ఎంగేజ్మెంట్.. వీడియో వైరల్

Srinivas Engagement: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇవాళ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రియురాలు కావ్యను అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. వీళ్ల ఎంగేజ్మెంట్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ గా మారింది. 

Published on: Mar 8, 2026, 16:11:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అల్లు శిరీష్, నయనిక మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. ఇప్పుడు మరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి కావ్యతో అతని ఎంగేజ్మెంట్ ఈ రోజు జరిగింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్

శ్రీనివాస్ ఎంగేజ్మెంట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ ఇవాళ (మార్చి 8) జరిగింది. హైదరాబాద్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ కు డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్, హీరోయిన్ సంయుక్త మీనన్ అటెండ్ అయ్యారు. కాబోయే దంపతులు శ్రీనివాస్, కావ్యతో వీళ్లు ఉన్న వీడియో వైరల్ గా మారింది.

కావ్య రెడ్డి ఎవరు?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి చేసుకోబోయే కావ్య రెడ్డి ఎవరు? అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అయితే కావ్యకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి పరిచయం కానీ, సంబంధం కానీ లేదు. కావ్య రెడ్డి తాత గతంలో జడ్జిగా పనిచేశారని అంటున్నారు. ఆమె తండ్రి ఓ లాయర్ అని తెలిసింది. శ్రీనివాస్, కావ్య పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లికి దారితీసిందని టాక్.

బ్లాక్ బస్టర్

ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన గత సినిమా ‘కిష్కింధపురి’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ హారర్ థ్రిల్లర్ థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్.

మూడు సినిమాలతో

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ మూడు సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. టైసన్ నాయుడు, హైందవ, రామం సినిమాల్లో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు శ్రీనివాస్ చేస్తున్న మూడు సినిమాలు కూడా దేనికదే డిఫరెంట్ గా ఉంది.

ఆ మూవీతో ఎంట్రీ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ మూవీతో డెబ్యూ చేశాడు. ఆ తర్వాత వరుసగా స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, ధీర, అల్లుడు అదుర్స్, ఛత్రపతి, భైరవం, కిష్కింధపురి సినిమాలు చేశాడు.

ఛత్రపతి మూవీతో హిందీలో అడుగుపెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తెలుగు ఛత్రపతిని హిందీలో రీమేక్ చేశారు. దీనికి వివి వినాయక్ డైరెక్టర్. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More