...
...
Next Story

Bellamkonda Srinivas: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బెల్లంకొండ శ్రీనివాస్.. పెళ్లికి ఆహ్వానించిన నటుడు

Bellamkonda Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని, తన కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని స్వయంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.

Published on: Apr 22, 2026, 19:02:06 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Bellamkonda Srinivas: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఈ మధ్యే అతడు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన పెళ్లి పనులను శ్రీనివాస్ అధికారికంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలోని పెద్దలను, ప్రముఖులను కలిసి వివాహానికి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మెగాస్టార్‌ను కలిసిన బెల్లంకొండ కుటుంబం..

Bellamkonda Srinivas: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బెల్లంకొండ శ్రీనివాస్.. పెళ్లికి ఆహ్వానించిన నటుడు
Bellamkonda Srinivas: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బెల్లంకొండ శ్రీనివాస్.. పెళ్లికి ఆహ్వానించిన నటుడు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ చిరంజీవికి సాదరంగా వివాహ శుభలేఖను అందజేసి, పెళ్లికి రావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ నెల 29న శ్రీనివాస్, కావ్య పెళ్లి జరగనుంది.

ఈ సందర్భంగా మెగాస్టార్ సాయి శ్రీనివాస్‌ను ఆశీర్వదించి, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవితో గడిపిన ఈ ఆత్మీయ క్షణాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక..

తొలి సినిమా 'అల్లుడు శీను'తోనే మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన నటించిన 'రాక్షసుడు' భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న తరుణంలో.. ఇండస్ట్రీలోని సన్నిహితులందరినీ ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు. ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా, సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుందని తెలుస్తోంది.

తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చిరంజీవిని మొదటి ఆహ్వానితుల్లో ఒకరిగా కలవడం పట్ల బెల్లంకొండ సురేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాయి శ్రీనివాస్ చేతిలో వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. వివాహం అనంతరం ఆయన మళ్ళీ షూటింగ్స్‌లో బిజీ కానున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్‌మెంట్

బెల్లకొండ శ్రీనివాస్ తన కాబోయే భార్య కావ్యను గతంలోనే పరిచయం చేశాడు. వాళ్లకు ఎంగేజ్‌మెంట్ ఎప్పుడో జరిగిపోయిందని వార్తలు వచ్చినా.. ఇది కేవలం తన కాబోయే భార్య పరిచయమే అని అప్పట్లో అతడు చెప్పాడు. కొన్ని ఫొటోలు షేర్ చేస్తూ కావ్య రెడ్డిని కావ్యమ్మా అని పిలుస్తూ అందమైన నోట్ రాసుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.

మొత్తానికి ఆ కావ్యమ్మ మెడలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు మూడు ముళ్లు వేయబోతున్నాడు. ఈ నెల 29న ఈ ఇద్దరి వివాహం జరగనుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe