Bellamkonda Srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రేయసి కావ్యరెడ్డిని అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ కొత్త దంపతులు హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్నారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్లైన జంట ఇంట్లోకి వెళ్లేముందు పేర్లు చెప్పాలి. ఆ సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి పేర్లు చెప్పిన విధానం ఇప్పుడు వైరల్ గా మారింది.
నా భర్తతో

‘‘నేను కావ్య బెల్లంకొండ. మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండతో మా ఇంటికి కొత్త కోడలిగా వచ్చాను’’ అని కావ్య రెడ్డి క్యూట్ గా చెప్పడంతో అక్కడున్న ఫ్యామిలీ అంతా కేకలు పెడతారు. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ను చెప్పమంటారు.
కావ్య ముద్దుగా
‘‘మా ఇంటికి మా ఆవిడను తీసుకొచ్చాను. మీరంతా ఏంటీ? జరగండి’’ అని ఫస్ట్ సరదాగా చెప్పాడు బెల్లంకొండ శ్రీనివాస్. సరిగ్గా చెప్పాలని అందరూ అడుగుతారు. అప్పుడే తన భర్త బెల్లంకొండ శ్రీనివాస్ ను కావ్య ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలిసిపోయింది. ఆమె తన భర్తను ‘చెప్పు శ్రీని’ అని అడుగుతుంది.
దీంతో.. ‘‘నా భార్య కావ్య బెల్లంకొండతో మా ఇంటికి వచ్చా. నా పేరు అల్లుడు శీను. అల్లుడు శీనుగా వచ్చా’’ అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్తాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
అల్లుడు శీనుతో
పాపులర్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కొనసాగుతున్నాడు. అతను ‘అల్లుడు శీను’ మూవీతోనే డెబ్యూ చేశాడు. 2014లో వచ్చిన ఈ మూవీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ అల్లుడు శీనుగా మారాడు.
{{/usCountry}}పాపులర్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడైన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కొనసాగుతున్నాడు. అతను ‘అల్లుడు శీను’ మూవీతోనే డెబ్యూ చేశాడు. 2014లో వచ్చిన ఈ మూవీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ అల్లుడు శీనుగా మారాడు.
{{/usCountry}}బెల్లంకొండ శ్రీనివాస్ తన కెరీర్లో అల్లుడు శీను, స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, ఛత్రపతి (హిందీ), భైరవం, కిష్కింధపురి సినిమాలు చేశాడు.
పెళ్లి గురించి..
చాలా కాలంగా ప్రేమలో మునిగితేలిన బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు. బుధవారం (ఏప్రిల్ 29) రాత్రి తిరుమలలో వీళ్లు వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు అటెండ్ అయ్యారు. బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ ఇవాళ (మే 1) హైదరాబాద్ లో జరుగుతుందని తెలిసింది. ఈ రిసెప్షన్ కు సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు అటెండ్ కాబోతున్నారు.