ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 4 మలయాళం సినిమాలు ఇవే- ఒకేదాంట్లో 2- తెలుగులో 1 మాత్రమే- హారర్ నుంచి కామెడీ వరకు!

ఓటీటీ ప్రియుల కోసం ఈ వారం మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి థ్రిల్లర్, కామెడీ, రొమాంటిక్ డ్రామాలు సిద్ధమయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ వంటి తదితర ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి వీటిలో చూడాల్సిన ది బెస్ట్ 4 మలయాళం ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Updated on: Dec 30, 2025, 19:29:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. తక్కువ బడ్జెట్‌తోనే అద్భుతమైన కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో మాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఇప్పుడు భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు సైతం ఓటీటీలో మలయాళ సినిమాలపై మక్కువ చూపిస్తున్నారు. మరి ఈ వారం ఓటీటీ రిలీజ్ కానున్న, మిస్ అవ్వకుండా చూడాల్సిన ది బెస్ట్ 4 మలయాళ సినిమాలు ఏంటో చూద్దాం.

ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 4 మలయాళం సినిమాలు ఇవే- ఒకేదాంట్లో 2- తెలుగులో 1 మాత్రమే- హారర్ నుంచి కామెడీ వరకు!
ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 4 మలయాళం సినిమాలు ఇవే- ఒకేదాంట్లో 2- తెలుగులో 1 మాత్రమే- హారర్ నుంచి కామెడీ వరకు!

1. ఎకో (Eko)– నెట్‌ఫ్లిక్స్‌లో ఉత్కంఠభరిత వేట!

థియేటర్లలో భారీ వసూళ్లతో రికార్డు సృష్టించిన ‘ఎకో’ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి వస్తోంది. కేరళ-కర్ణాటక సరిహద్దుల్లోని కొండ ప్రాంతంలో ఒంటరిగా నివసించే మలతి చేడతి అనే వృద్ధురాలి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఊరికి దూరంగా ఉండే ఆమె జీవితంలోకి అనుకోని అతిథులు రావడం, ఆమె భర్త కురియాచన్ కోసం పోలీసులు, తీవ్రవాదులు వేట సాగించడం వంటి అంశాలతో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
స్ట్రీమింగ్ తేదీ: డిసెంబర్ 31, 2025 (తెలుగు వెర్షన్ జనవరి 7 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది).

2. నిధియుమ్ భూతవుమ్ (Nidhiyum Bhoothavum)– దెయ్యాల కొంపలో మెకానిక్స్!

ముగ్గురు యువ మెకానిక్స్ తమ బైక్ వర్క్‌షాప్‌ను ఊరి బయట ఉన్న ఒక పాత హోమ్‌ స్టేకి మారుస్తారు. అయితే, ఆ ఇల్లు దెయ్యాల కొంప అని స్థానికులు నమ్ముతుంటారు. అక్కడ వారికి ఎదురైన వింత అనుభవాలు, పారానార్మల్ శక్తుల నుంచి వారు ఎలా బయటపడ్డారు అనే అంశాన్ని కామెడీ మిళితం చేసి సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించారు.

ఓటీటీ: సన్ నెక్ట్స్ (Sun NXT)
స్ట్రీమింగ్ తేదీ: డిసెంబర్ 30, 2025.

3. ఇతిరి నేరం (Ithiri Neram)– పాత ప్రేమ జ్ఞాపకం!

కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్న అనీష్, అంజన చాలా కాలం తర్వాత అనుకోకుండా తిరువనంతపురంలో కలుస్తారు. ఆ ఒక్క రాత్రి ప్రయాణంలో వారి మధ్య సాగే సంభాషణలు, పాత జ్ఞాపకాలు, పెళ్లైన తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఈ సినిమాలో హృద్యంగా చూపించారు. ‘జయ జయ జయ జయ హే’ ఫేమ్ అంజనా మరిక్కర్, రోషన్ మాథ్యూ నటన ఈ సినిమాకు హైలైట్.

ఓటీటీ: సన్ నెక్ట్స్
స్ట్రీమింగ్ తేదీ: డిసెంబర్ 31, 2025.

4. ఇన్నోసెంట్ (Innocent)– ఒక క్లర్క్ నిజాయితీ పోరాటం!

వినోద్ అనే ఒక సాధారణ క్లర్క్ జీవితం ఓ చిన్న సంఘటనతో ఎలా తలకిందులైందో ఈ సినిమాలో చూడొచ్చు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పబ్లిక్ టాయిలెట్‌ను వాడుకున్న అతన్ని జనం పొరపాటున వికృత చేష్టలు చేసేవాడిగా ముద్ర వేస్తారు. సమాజం చేసే అవమానాలను ఎదుర్కొని, తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఒక సామాన్యుడు పడే కష్టాలే ఈ ‘ఇన్నోసెంట్’ కథ.

ఓటీటీ: సైనా ప్లే (Saina Play)
స్ట్రీమింగ్ తేదీ: డిసెంబర్ 29, 2025

ది బెస్ట్‌ 4గా

ఇలా ఓటీటీ రిలీజ్ అయ్యే మలయాళ సినిమాల్లో ది బెస్ట్‌ 4గా ఈ మూవీస్ ఉన్నాయి. వీటిలో ఒకటి తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కానుండగా.. రెండు సినిమాలు సన్ నెక్ట్స్ ఓటీటీలో ప్రీమియర్ కానున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More