వి లవ్యూ రామ్-కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటూ భాగ్యశ్రీ లవ్-సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటున్న ఫ్యాన్స్
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే డేటింగ్ పుకార్ల మధ్య 'ఆంధ్రా కింగ్ తాలూకా' ఈవెంట్‌లో ఆమె స్పీచ్ వైరల్ గా మారింది. తన మాటల్లో రామ్ పై ప్రేమను కురిపించేసింది. దీంతో ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన జోడీ ఇది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కలిసి నటించిన ఈ జంట లవ్ లో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. ఒక దశలో వారిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఈ జంట మౌనంగా ఉన్నప్పటికీ, ఇటీవల జరిగిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమా ఈవెంట్‌లో రామ్ గురించి భాగ్యశ్రీ మాటలు వారిద్దరూ ప్రేమలో ఉన్నారని అభిమానులను నమ్మేలా చేసింది.

కింగ్ ఆఫ్ హార్ట్స్
‘‘రామ్ పోతినేనికి ప్రేమంతా దక్కాలి. తమ అభిమానులను అంతగా ప్రేమించే వ్యక్తి ఎవరో, వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి ఎవరో, వారికోసం సినిమా తీసిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆ ఒక్కరే.. ఏమంటారు? కింగ్ ఆఫ్ హార్ట్స్ అంటారు. అతనే రామ్’’ అని భాగ్యశ్రీ తన మాటలతో రామ్ పై ప్రేమ కురిపించేసింది. భాగ్యశ్రీ ఇలా చెబుతుంటే రామ్ ఆశ్చర్యపోయి, నవ్వుతో ముఖం ఎర్రబడటం ఆపలేకపోయాడు.
లవ్యూ రామ్
‘‘ఈరోజు అంతా ఆయన గురించే, మన గురించి కాదు, ఇంకెవరి గురించి కాదు. అంతా రామ్ పోతినేని గురించే, ఎందుకంటే మీరు ఇక్కడ దక్కించుకోవాల్సిన ప్రేమంతా మీకు దక్కాలి. ధన్యవాదాలు రామ్, మీరు బెస్ట్. ఈ ప్రేమంతా మీకు దక్కాలి. మీ విజయం, అపజయం.. మీరు టాప్‌లో ఉన్నా, మాతో ఇక్కడ ఉన్నా, మాకు మీరు ఎప్పుడూ పైనే ఉంటారు. మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం. వి లవ్యూ రామ్’’ అని భాగ్యశ్రీ పేర్కొంది.
ప్రేమ ఉందని
భాగ్యశ్రీ స్పీచ్, దానికి రామ్ రియాక్షన్ తో వారిద్దరూ డేటింగ్ చేస్తున్నారని అభిమానులు నమ్ముతున్నారు. అనేక మంది ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు భాగ్యశ్రీ స్పీచ్ క్లిప్‌ను షేర్ చేస్తూ, తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఒక అభిమాని ఇలా అన్నారు.. 'రీల్ లైఫ్‌లో, నిజ జీవితంలో కూడా మంచి జోడీ' అని పేర్కొన్నాడు. 'ఇంటి పేరు అన్నిసార్లు చెప్పిందంటే పుకార్లను బట్టి చూస్తే ప్రేమ గాలిలో ఉందనిపిస్తోంది' అని మరో యూజర్ రాసుకొచ్చాడు.
భాగీ పోతినేని
'ప్రేమ గాలిలో ఉంది అనిపిస్తుంది', 'భార్య భర్తను సమర్థిస్తోంది', 'భాగీ పోతినేని' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరు అభిమానులు ఏమో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల మాదిరిగానే భాగ్యశ్రీ, రామ్ కూడా తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచుతున్నారని భావించారు. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి మహేష్ బాబు పచిగొళ్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రామ్, భాగ్యశ్రీలతో పాటు నిమ్మా ఉపేంద్ర కూడా నటించారు. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


