Bhagyaraj Dog: మాట రాని మూగ వేదన..భాగ్యరాజ్ శవపేటిక దగ్గర దీనంగా పెంపుడు కుక్క.. కంట నీరుతో.. మనసులు కదిలిస్తున్న వీడియో

Bhagyaraj Dog: తమిళ దిగ్గజ నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రైటర్ భాగ్యరాజ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన శవ పేటిక దగ్గర పెంపుడు కుక్క దీనంగా తిరుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట రాని మూగ వేదన పడుతున్న ఆ కుక్క కళ్లలో నీళ్లు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.  

Published on: Jun 28, 2026, 11:09:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhagyaraj Dog: తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకుడు, నటుడు, స్క్రీన్‌ప్లే రైటర్ కె. భాగ్యరాజ్ (73) శనివారం (జూన్ 27, 2026) ఉదయం చెన్నైలో గుండెపోటుతో ఆకస్మాత్తుగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ మరణ వార్తతో కోలీవుడ్, టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పెంపుడు కుక్క భాగ్యరాజ్ శవపేటిక దగ్గర తిరుగుతున్న వీడియో మనసులను కలచివేస్తోంది.

మాట రాని మూగ వేదన..భాగ్యరాజ్ శవపేటిక దగ్గర దీనంగా పెంపుడు కుక్క
మాట రాని మూగ వేదన..భాగ్యరాజ్ శవపేటిక దగ్గర దీనంగా పెంపుడు కుక్క

ఆ మూగజీవి వేదన

లెజండరీ భాగ్యరాజ్ ఇక లేరు. ఆయన అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, అభిమానుల కోసం భాగ్యరాజ్ పార్థివ దేహాన్ని ఇంటి దగ్గర ఉంచారు. అప్పుడే ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క ఆ శవపేటిక దగ్గర తిరుగుతూ, తన యజమాని భౌతికకాయం వైపు చూస్తూ మూగ వేదనను వ్యక్తపరిచిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. మానవుల కంటే జంతువుల విశ్వాసం గొప్పదనేలా ఆ దృశ్యం సాగింది.

ఆ పెంపుడు కుక్క కళ్లు కూడా కన్నీటితో తడిచాయి. ఈ ఫొటోలు, వీడియోలు ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తున్నాయి. తన యజమానిని అలా చూసి ఆ పెంపుడు జంతువు బాధ పడుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తమిళనాడు సీఎం విజయ్ నివాళి

భాగ్యరాజ్ భౌతిక కాయానికి సినీ దిగ్గజాలు నివాళి అర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్.. భాగ్యరాజ్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించారు. భాగ్యరాజ్ కుటుంబ సభ్యులను (సతీమణి పూర్ణిమ, కుమారుడు శాంతను) ఓదార్చారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా అధికారిక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు.

విలపించిన సినీ లోకం

భాగ్యరాజ్ మరణ వార్త విని తమిళ, తెలుగు సెలబ్రిటీలు షాక్ అయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్, ధనుష్ (తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు), నయనతార, విఘ్నేష్ శివన్, శివకార్తికేయన్, రాధికా శరత్‌కుమార్ వంటి ఎందరో ప్రముఖులు ఆయన నివాసానికి తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.

చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

కేవలం రెండు రోజుల క్రితమే గోవాలో జరిగిన నటి ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకలో అందరితో కలిసి ఎంతో సంతోషంగా గడిపిన భాగ్యరాజ్.. ఇలా హఠాత్తుగా మనల్ని విడిచి వెళ్లిపోవడం నమ్మలేకపోతున్నామంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు.

ముగిసిన అంత్యక్రియలు

భాగ్యరాజ్ అంత్యక్రియలు ఆదివారం చెన్నైలో ముగిశాయి. తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈ కార్యక్రమం జరిగింది. భాగ్యరాజ్ మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఒక గొప్ప "స్క్రీన్‌ప్లే కింగ్" ను కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More