varalaxmi sarathkumar: మొరిగే కుక్క కరవదు.. కానీ నేను కరుస్తానంటూ వరలక్ష్మి సంచలన పోస్ట్.. మూవీ డైరెక్టర్ తో వివాదం

varalaxmi sarathkumar: విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ సంచలన పోస్టు పెట్టింది. మొరిగే కుక్క కరవదు అంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. 'పోలీస్ కంప్లైంట్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ కామెంట్లకు కౌంటర్ గానే వరలక్ష్మి ఈ పోస్టు పెట్టిందని అంటున్నారు.

Published on: Jun 11, 2026, 09:29:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

varalaxmi sarathkumar: పోలీస్ కంప్లైంట్ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి వర్సెస్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాదం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా సినిమా విడుదల కావడానికి కొన్ని గంటల ముందు 'పోలీస్ కంప్లైంట్' చిత్ర యూనిట్ ఫిలిం ఛాంబర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనికి కౌంటర్ గా వరలక్ష్మి పెట్టిన పోస్టు మరింత సంచలనంగా మారింది.

వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన పోస్ట్ (x)
వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన పోస్ట్ (x)

మొరిగే కుక్కలు అంటూ

విభిన్న పాత్రలతో దూసుకెళ్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ‘‘మొరిగే కుక్కలు కరవవు. కరిచే కుక్కలు మొరగవు. నేను మొరగను.. కరుస్తాను’’ అని వరలక్ష్మి ఓ పోస్టు పెట్టింది. ఈ పోస్టు కలకలం రేపుతోంది. పోలీస్ కంప్లైంట్ మూవీ టీమ్ చేసిన కామెంట్లకు కౌంటర్ గానే వరలక్ష్మి ఈ పోస్టు పెట్టిందనే కామెంట్లు వస్తున్నాయి.

డైరెక్టర్ ఏమన్నాడంటే?

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన మూవీ పోలీస్ కంప్లైంట్. ఇది హారర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ చిత్రం జూన్ 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం (జూన్ 10) మూవీ టీమ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందులో డైరెక్టర్ సంజీవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘‘వరలక్ష్మి సినిమా సెకండాఫ్ డబ్బింగ్ చెప్పడానికి మూడు నెలల టైమ్ తీసుకుంది. ఈ మూడు నెలల్లో ఆమె సొంత సినిమా సరస్వతి చేసుకున్నారు. అగ్రిమెంట్ ను బ్రేక్ చేశారు. డబ్బులు తీసుకుని ప్రమోషన్స్ కు ఎందుకు రారు? ఆమెని రమ్మని అడుకున్నా కానీ రాలేదు’’ అని సంజీవ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పుడు ఈ కామెంట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. 45 రోజుల్లో, 52 మంది నటీనటులతో ఎంతో కష్టపడి తీసిన ఈ హారర్ యాక్షన్ థ్రిల్లర్‌కు ఇప్పుడు పబ్లిసిటీ పరంగా పెద్ద షాక్ తగిలిందనే కామెంట్లు వస్తున్నాయి. నవీన్ చంద్ర కూడా ప్రమోషన్స్ కు రావడం లేదన్నారు.

మూవీపై ఎఫెక్ట్

వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర వంటి పవర్‌ఫుల్ పర్ఫార్మర్ల ఫేస్ వాల్యూ మీదే ఈ సినిమా బిజినెస్ ఆధారపడి ఉంటుంది. వారు ప్రమోషన్లకు దూరంగా ఉండటం వల్ల సినిమాకు రావాల్సిన ఓపెనింగ్స్ తగ్గే ప్రమాదం ఉంది. ఫలితంగా థియేట్రికల్ రన్‌పై, శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ వాల్యూపై తీవ్ర ప్రభావం పడుతుంది.

People Also Ask- తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

పోలీస్ కంప్లైంట్ మూవీ వివాదం ఏంటీ?

డబ్బులు తీసుకొని కూడా ప్రమోషన్లకు వరలక్ష్మి రావడం లేదని డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై కౌంటర్ గా వరలక్ష్మి పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

పోలీస్ కంప్లైంట్ ఎప్పుడు రిలీజ్ కానుంది.

ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

పోలీస్ కంప్లైంట్ మూవీ కథ ఏంటి?

ఇది ఒక హారర్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ చిత్రం. మనం చేసే పనుల వల్ల వచ్చే 'కర్మ' మనల్ని ఎలా వెంటాడుతుంది అనే ఇంట్రెస్టింగ్ చైన్ రియాక్షన్ పాయింట్‌తో తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను రూపొందించారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More