OTT Horror: 3 ఓటీటీల్లోకి మిస్టరీ హారర్ థ్రిల్లర్- కన్యల ఆశ్రమంలో గర్భం దాల్చే నన్, దేవుడి మహిమా? తెలుగులోనే స్ట్రీమింగ్

Horror Thriller Immaculate OTT Streaming On 3 Platforms: ఓటీటీలోకి తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చింది మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఇమ్మాక్యులేట్. హాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సిడ్నీ స్వీనీ, మనీ హైస్ట్ అల్వారో మోర్టె ప్రధాన పాత్రలు పోషించారు. భయపెట్టే ఇమ్మాక్యులేట్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.

Published on: Jun 9, 2026, 12:49:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Horror Thriller Immaculate OTT Release In 3 Platforms: హాలీవుడ్ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో మిస్ అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి మిస్టరీ హారర్ చిత్రాలను చూసేందుకు సినిమా ప్రియులు విపరీతమైన ఆసక్తి చూపిస్తుంటారు.

3 ఓటీటీల్లోకి మిస్టరీ హారర్ థ్రిల్లర్- కన్యల ఆశ్రమంలో గర్భం దాల్చే నన్, దేవుడి మహిమా? తెలుగులోనే స్ట్రీమింగ్
3 ఓటీటీల్లోకి మిస్టరీ హారర్ థ్రిల్లర్- కన్యల ఆశ్రమంలో గర్భం దాల్చే నన్, దేవుడి మహిమా? తెలుగులోనే స్ట్రీమింగ్

స్వచ్ఛమైనది అని అర్థం

ఈ క్రమంలోనే అంతర్జాతీయ వేదికలపై ఆకట్టుకున్న మిస్టరీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మాక్యులేట్' (Immaculate) ఓటీటీలోకి వచ్చేసింది. ఇమ్మాక్యులేట్ అంటే నిర్మలమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన అనే అర్థాలు వస్తాయి. ప్రస్తుతం 3 ఓటీటీల్లో ఇమ్మాక్యులేట్ స్ట్రీమింగ్ అవుతోంది.

అసలు కథేంటంటే?

'యుఫోరియా', 'ఎనీవన్ బట్ యూ' చిత్రాలతో గ్లోబల్ క్రష్‌గా మారిన బోల్డ్ బ్యూటీ సిడ్నీ స్వీనీ లీడ్ రోల్ పోషించింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఇమ్మాక్యులేట్ సినిమా కథ మొత్తం ఒక వింత మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. సిసిలియా అనే యువతి ఒక గడ్డకట్టిన సరస్సులో పడి ప్రాణాపాయ స్థితి నుంచి తృటిలో తప్పుకుంటుంది.

దేవుడే తనను కాపాడాడని నమ్మిన సిసిలియా, పూర్తిగా క్రైస్తవ మతం వైపు మళ్లుతుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇటలీలోని ఒక పురాతన కాన్వెంట్ (కన్యల ఆశ్రమం) నుంచి ఫాదర్ సాల్ టెడెస్చీ ద్వారా ఆహ్వానం అందుతుంది. దేవుడి సేవలో తరించాలని సిసిలియా సంతోషంగా ఇటలీ బయలుదేరుతుంది. అక్కడ సన్యాసిని (నన్) మారడానికి దీక్ష తీసుకుంటుంది.

కన్య గర్భం దాలిస్తే..?

అయితే, ఆ ఆశ్రమంలో అడుగుపెట్టిన కొన్ని రోజులకే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. కన్య అయిన సిసిలియా గర్భం దాలుస్తుంది. శారీరక బంధాలకు దూరంగా ఉండే ఆ ఆశ్రమంలో నన్ ప్రెగ్నెంట్ ఎలా అయిందో ఎవరికీ అర్థం కాదు. అసలు ఈ గర్భం వెనుక ఉన్న రహస్యం ఏంటి? దేవుడి మహిమా లేక ఎవరిదైనా కుతంత్రామా అని సిసిలియా అన్వేషించడం మొదలుపెడుతుంది.

ఆ క్రమంలోనే కాన్వెంట్‌లో జరిగే కొన్ని అతీత శక్తుల (పారానార్మల్) భయానక సంఘటనలను సిసిలియా ఎదుర్కొంటుంది. అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడేందుకు పారిపోవాలని చూసిన సిసిలియాను కొన్ని శక్తులు అడ్డుకుంటాయి. చివరికి ఆ గర్భంలో పెరుగుతున్న పిండం వెనుక ఉన్న భయంకరమైన సత్యాన్ని ఆమె ఎలా కనుగొంది? తన ప్రాణాలను ఎలా కాపాడుకుంది? అనేదే మిగతా కథ.

ప్రతిభావంతులైన నటీనటులు

ఇమ్మాక్యులేట్ సినిమాలో సిస్టర్ సిసిలియాగా సిడ్నీ స్వీనీ తన నటనతో భయపెట్టడమే కాకుండా గ్లామర్ పరంగానూ మెప్పించింది. 'మనీ హైస్ట్' ఓటీటీ సిరీస్‌లో 'ప్రొఫెసర్' పాత్రతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకున్న స్పానిష్ నటుడు అల్వారో మోర్టె ఇందులో ఫాదర్ సాల్ టెడెస్చీగా కీలక పాత్ర పోషించారు.

సిస్టర్ గ్వెన్‌గా బెనెడెట్టా పొరకరోలి, మదర్ సుపీరియర్‌గా డోరా రొమానో, కార్డినల్ ఫ్రాంకో మెరోలాగా జార్జియో కొలాంగేలి నటించారు. ఆండ్రూ లోబెల్ అందించిన అద్భుతమైన స్క్రిప్ట్‌తో దర్శకుడు మైఖేల్ మోహన్ ఈ హారర్ థ్రిల్లర్‌ను సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్‌గా తెరకెక్కించారు.

మరో ఓటీటీలోకి

ఈ చిత్రాన్ని బ్లాక్ బేర్ పిక్చర్స్, మిడిల్ చైల్డ్ పిక్చర్స్, ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిల్మ్స్ బ్యానర్లపై డేవిడ్ బెర్నాడ్, సిడ్నీ స్వీనీ, జోనాథన్ డేవినో, మైఖేల్ హీమ్లర్ సంయుక్తంగా నిర్మించారు. ఇదివరకు రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న హారర్ థ్రిల్లర్ ఇమ్మాక్యులేట్ ఇటీవల మరోదాంట్లోకి వచ్చేసింది.

2024లో థియేట్రికల్ రిలీజ్ అయిన ఇమ్మాక్యులేట్ అదే సంవత్సరం సెప్టెంబర్ 6న బుక్ మై షో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే, రూ. 149 చెల్లింపుతో రెంటల్ విధానంలో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అయింది. అనంతరం అమెజాన్ ప్రైమ్‌లో ఎలాంటి అద్దె పద్ధతి లేకుండా ఇంగ్లీష్‌లో ఇమ్మాక్యులేట్ ఓటీటీ రిలీజ్ అయింది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

ఇటీవల జూన్ 5 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఇమ్మాక్యులేట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, జియో హాట్‌స్టార్ ఓటీటీలో కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ఇమ్మాక్యులేట్ అందుబాటులోకి వచ్చేసింది.

హారర్ జోనర్ ఇష్టపడేవారికి 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఇమ్మాక్యులేట్ సినిమాను చూసేయొచ్చు. తెలుగులో కావాలనుకునేవారు జియో హాట్‌స్టార్ ఓటీటీని ఎంచుకోవడం బెటర్.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More