...
...
Next Story

Bhagyashri Borse: హైదరాబాద్ నా కర్మభూమి, నా చివరి సినిమా కూడా ఇక్కడే.. లెనిన్ సక్సెస్ మీట్‌లో ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

Bhagyashri Borse: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్ అయింది. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంటూ హైదరాబాద్‌ను తన ‘కర్మభూమి’గా పేర్కొంది. ఆమె బాధ వెనుక అసలు కారణం ఇదే.

Published on: Jul 11, 2026, 14:07:39 IST
Advertisement

Bhagyashri Borse: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబినేషన్‌లో వచ్చిన ఇంటెన్స్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ (Lenin) నిన్న జూలై 10, 2026న థియేటర్లలోకి వచ్చి డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది. ‘ఏజెంట్’ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకున్న అఖిల్‌కు ఈ సినిమా మంచి ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే శనివారం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ‘లెనిన్ సక్సెస్ మీట్’ లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. స్టేజ్ పై మాట్లాడుతుండగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఒక్కసారిగా ఏడ్చేసింది.

ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

హైదరాబాద్ నా కర్మభూమి, నా చివరి సినిమా కూడా ఇక్కడే.. లెనిన్ సక్సెస్ మీట్‌లో ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే (x)
హైదరాబాద్ నా కర్మభూమి, నా చివరి సినిమా కూడా ఇక్కడే.. లెనిన్ సక్సెస్ మీట్‌లో ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే (x)

అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే. ఈ మూవీ అఖిల్ కాదు భాగ్యశ్రీ కూడా ఫస్ట్ సాలిడ్ హిట్ అందించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో Bhagyashri Borse emotional speech, Lenin public talk అనే కీవర్డ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేవలం ఆమె ఏడ్చారు అనే పాయింట్ కంటే.. ఒక ముంబై బ్యూటీ టాలీవుడ్‌ను ఓన్ చేసుకున్న విధానం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్ కర్మభూమి

శనివారం (జూలై 11) లెనిన్ సక్సెస్ మీట్ లో అఖిల్, నాగార్జునకు భాగ్యశ్రీ థ్యాంక్స్ చెప్పింది. అఖిల్ తో మళ్లీ యాక్ట్ చేసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నానంది. ఈ సందర్భంలోనే తన కెరీర్, ఫ్యాన్స్ గురించి చెప్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అయింది భాగ్యశ్రీ. ఫ్యాన్స్ తనకెప్పుడూ సపోర్ట్ గానే ఉంటున్నారని కన్నీళ్లు పెట్టుకుంది.

భాగ్యశ్రీ బోర్సే సక్సెస్ మీట్ వేదికగా మాట్లాడుతూ.. "హైదరాబాద్ నా కర్మభూమి. నా చివరి సినిమా కూడా ఇక్కడే’’ అని కన్నీళ్లతో సంచలన ప్రకటన చేసింది.

ఇదే కారణం

వరుసగా ఫ్లాప్స్ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా భాగ్యశ్రీ గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్కిల్స్‌కు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు లెనిన్ తో భాగ్యశ్రీ ఫస్ట్ హిట్ అందుకోవడంతో కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.

రేంజ్ మారడం ఖాయం!

భాగ్యశ్రీ పండించిన ఎమోషనల్ యాక్టింగ్ లెనిన్ సినిమాకు ప్లస్ అయింది. ఈ సక్సెస్‌తో టాలీవుడ్ టాప్ లీగ్ హీరోయిన్ల రేసులోకి భాగ్యశ్రీ బోర్సే అధికారికంగా ఎంట్రీ ఇచ్చిందని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ఈ ముంబై భామ టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల ప్రాజెక్టులకు ఫస్ట్ ఛాయిస్‌గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe