Lenin: ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? బర్త్ డే విషెస్ చెప్తూ లెనిన్ మూవీ మేకర్స్ పోస్టు..డిజాస్టర్ లుక్ అంటూ కామెంట్లు
Lenin: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ మూవీ నుంచి మేకర్స్ ఈ రోజు ఓ పోస్టర్ పంచుకున్నారు. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ దే ఆ పోస్టర్. కానీ ఆమె మాత్రం గుర్తుపట్టలేకుండా ఉంది. ఈ లుక్ పై నెటిజన్ల నుంచి నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.
Lenin: ఒక్క సాలిడ్ హిట్ కోసం కెరీర్ స్టార్టింగ్ నుంచి అక్కినేని అఖిల్ ఎదురు చూస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ స్టోరీలతో మూవీస్ చేసినా అతనికి సక్సెస్ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇప్పడు ఆశలన్నీ ‘లెనిన్’ మూవీపైనే పెట్టుకున్నాడు. అయితే లెనిన్ మేకర్స్ ఈ రోజు రిలీజ్ చేసిన హీరోయిన్ లుక్ పై మాత్రం నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి.

భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే
లెనిన్ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇవాళ (మే 6) భాగ్యశ్రీ బర్త్ డే. ఈ సందర్భంగా లెనిన్ మూవీ నుంచి భాగ్యశ్రీ లుక్ పోస్టర్ ను మేకర్స్ పంచుకున్నారు. అయితే ఈ పోస్టర్ పై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి.
గుర్తుపట్టలేనంతగా
నిజానికి ఈ పోస్టర్ చూపించి ఈ హీరోయిన్ ఎవరని అడిగితే, ఎవరూ గుర్తుపట్టలేరని చెప్పొచ్చు. మూతిపై మీసాలతో, నెత్తిన కిరీటంతో ఓ రాజులా భాగ్యశ్రీ కనిపించింది. ‘‘ఎంతో టాలెంటెడ్ భాగ్యశ్రీ బోర్సేకు లెనిన్ టీమ్ నుంచి హ్యాపీ బర్త్ డే. తాను ఎప్పుడూ చేసేలాగే భారతి క్యారెక్టర్లోనూ తన మ్యాజిక్ తో మెస్మరైజ్ చేసేందుకు వచ్చేస్తుంది’’ అని సితారా ఎంటర్ టైన్మెంట్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.
డిజాస్టర్ లుక్
భాగ్యశ్రీ బర్త్ డే సందర్భంగా బుధవారం లెనిన్ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఆమె లుక్ పై విమర్శలు వస్తున్నాయి. ‘డిజాస్టర్ లుక్’, ‘అసలే హైప్ లేదంటే ఇలాంటి పోస్టర్స్ తో ఏం ఉపయోగం? బర్త్ డేకు కామెడీ లుక్ ఏంటీ’ అని నెటిజన్లు కామెంట్లలో ఆడుకుంటున్నారు.
లెనిన్ గురించి
అక్కినేని అఖిల్ తో పాటు అతని తండ్రి నాగార్జున ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ‘లెనిన్’. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ మూవీని జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి మురళీ కిశోర్ డైరెక్టర్. సితారా ఎంటర్ టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.
హిట్ కోసం
ఓ హిట్ కోసం అక్కినేని అఖిల్ తో పాటు భాగ్యశ్రీ బోర్సే కూడా చాలా కాలం నుంచి ఎదురు చూస్తోంది. తెలుగులో ఈ భామ ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన భాగ్యశ్రీ.. కింగ్డమ్, ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాల్లో నటించింది. ఈ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోయాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


