Akkineni Akhil: అక్కినేని అఖిల్‌ను వదలని సినిమా కష్టాలు..లెనిన్ రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ.. పెద్ది గండమే సమస్యనా?
Akkineni Akhil: అక్కినేని నట వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టిన అకిల్ కు ఇప్పటివరకూ ఒక్క హిట్ కూడా దక్కలేదు. లెనిన్ మూవీతోనైనా సాలిడ్ హిట్ కొట్టాలని అతను చూస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. పెద్ది గండం పొంచి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Akkineni Akhil: ప్చ్.. అక్కినేని అఖిల్ కు ఏదీ కలిసి రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సాలిడ్ హిట్ కోసం అఖిల్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుని మూవీస్ చేస్తున్నా ఆ హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న లెనిన్ మూవీకి కష్టాలు తప్పడం లేదు.

లెనిన్ రిలీజ్
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న మూవీ లెనిన్. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. లెనిన్ షూటింగ్ స్టార్ట్ అయి కూడా చాలా రోజులే అయిపోతుంది. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
పెద్ది కోసం
నిజానికి లెనిన్ సినిమాను మే 1, 2026న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫస్ట్ ప్లాన్ వేసుకున్నారు. కానీ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీని ఏప్రిల్ 30న విడుదల చేస్తామని చెప్పడంతో లెనిన్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. పెద్ది మూవీ కోసం లెనిన్ రిలీజ్ ను వాయిదా వేసుకున్నామని మేకర్స్ అప్పుడు చెప్పారు.
మరోసారి
అయితే మరోసారి లెనిన్ కు పెద్ది గండం పొంచి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. లెనిన్ ను జూన్ 26న రిలీజ్ చేయాలని మూవీ టీమ్ అనుకుంది. కానీ ఇప్పుడు పెద్ది మూవీ ఏమో జూన్ 25న రిలీజ్ అవుతుందని అంటున్నారు. పెద్ది లాంటి సినిమాతో పోటీపడేందుకు లెనిన్ డేర్ చేయకపోవచ్చని టాక్. దీంతో లెనిన్ కు కొత్త రిలీజ్ డేట్ చూసుకోవడం తప్పా మరో మార్గం లేదని తెలిసింది.
ముందా? వెనకా?
లెనిన్ రిలీజ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. కన్ఫ్యూజన్ కూడా అదే స్థాయిలో ఉంది. లెనిన్ ను పెద్ది కంటే ముందే తీసుకు వస్తారా? లేదా తర్వాత రిలీజ్ చేస్తారా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందే సినిమాను విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ అనుకుంటున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి.
నాగార్జున సూచనతో
లెనిన్ షూటింగ్ విషయంలోనూ స్పష్టత లేదు. తాజాగా రషెస్ చూసిన నాగార్జున ఈ మూవీతో కొంత భాగాన్ని మార్చమని చెప్పారంటా. దీంతో మళ్లీ రీ షూట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నానే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే లెనిన్ రిలీజ్ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది. మరి లెనిన్ థియేటర్లకు వచ్చేది ఎప్పుడు? అఖిల్ హిట్ అందుకుంటాడా? అని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


