నటి భాగ్యశ్రీ బోర్సే 'కాంత' మూవీలో దుల్కర్ సల్మాన్‌పై చేయిచేసుకునే సీన్ గురించి మాట్లాడింది. అందులో తాను అతన్ని కొట్టడానికి సంకోచించినట్లు చెప్పింది. భాగ్యశ్రీ.. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో కలిసి ఇచ్చిన ఒక కొత్త ఇంటర్వ్యూలో.. 'కాంత' సినిమాలోని ఒక సీన్ గురించి షేర్ చేసుకుంది. ఈ సీన్ లో ఆమె పాత్ర దుల్కర్ సల్మాన్ పాత్రను కొట్టవలసి వచ్చింది.
భాగ్యశ్రీ ఏమన్నదంటే?

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ కలిసి నటించిన కాంత మూవీ నవంబర్ 14న థియేటర్లలో రిలీజైన విషయం తెలుసు కదా. ఈ సినిమాలో చేయిచేసుకునే సీన్స్ ఉన్నప్పటికీ దుల్కర్ పాత్రను కొట్టే సీన్ లో తాను సంకోచించానని భాగ్యశ్రీ తెలిపింది. "తెర వెనుక అలా చేయడానికి నేను కొంచెం వెనుకాడాను. కానీ ఆ పర్ఫెక్షన్ ను అతను (దుల్కర్) కోరుకున్నాడని నేను అనుకుంటున్నాను.
ఆ నటనను నా నుండి వెలికితీయడానికి అతను దానిని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దానిని నేను గౌరవిస్తాను. కానీ నేను నిజంగా సంకోచించాను. నేను నా జీవితంలో అలా చేయడం ఇదే మొదటిసారి" అని భాగ్యశ్రీ చెప్పింది. ఈ సీన్ తర్వాత దుల్కర్ ముఖం ఎర్రబడింది అని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెలిపాడు.
కాంత మూవీ ఎలా ఉందంటే?
సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన మూవీ కాంత. ఇందులో టీకే మహదేవన్ పాత్రలో దుల్కర్ నటించాడు. ఇక సముద్రఖని అతని గురువు, డైరెక్టర్ అయ్య పాత్రలో కనిపించాడు. భాగ్యశ్రీ ఓ యువ నటి పాత్ర పోషించింది.
సినిమా షూటింగ్ టైమ్‌లో నటీనటులు, టెక్నిషియన్స్, క్రియేటర్స్ మధ్య వచ్చే మనస్పర్థలు, గొడవలు ఆసక్తి కలిగిస్తుంటాయి. వీటిని మూవీ కంటే ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు ఆడియెన్స్. అలా డైరెక్టర్, హీరో మధ్య ఉండే అహం, ఇగో క్లాష్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే కాంత.
{{/usCountry}}సినిమా షూటింగ్ టైమ్‌లో నటీనటులు, టెక్నిషియన్స్, క్రియేటర్స్ మధ్య వచ్చే మనస్పర్థలు, గొడవలు ఆసక్తి కలిగిస్తుంటాయి. వీటిని మూవీ కంటే ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు ఆడియెన్స్. అలా డైరెక్టర్, హీరో మధ్య ఉండే అహం, ఇగో క్లాష్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే కాంత.
{{/usCountry}}సినీ పరిశ్రమలో హీరోలు, నటీనటుల క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వచ్చే సంఘర్షణలను చాలా బాగా చూపించారు డైరెక్టర్. ఇద్దరు గొప్ప వ్యక్తుల అహాన్ని చాలా నాటకీయంగా ఫస్టాఫ్ అంతా చూపించారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలనుకునే ఇగోతో ఎక్కడి వరకు వెళ్లారు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
సినిమాలో గురు, శిష్యుల మధ్య బంధం, గొడవ, సంఘర్షణ, వారిని కలిపేందుకు హీరోయిన్ ట్రై చేయడం వంటి సీన్స్ ఆకట్టుకుంటాయి. స్వర్ణయుగపు సినిమా గొప్పతనాన్ని చెప్పే సీన్స్ బాగుంటాయి.
ఇందులో రానా కూడా ఓ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ పాత్ర పోషించాడు. ఈ సినిమాకు రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా వసూళ్లు సాధించలేకపోతోంది. తొలి వారంలో సుమారు రూ.20 కోట్ల వరకూ వసూలు చేసింది.