Bhagyashri Borse: మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసేందుకు ట్రై చేస్తోంది. గ్లామర్, యాక్టింగ్ తో మెప్పిస్తున్న ఈ బ్యూటీ తాజాగా లెనిన్ తో ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా భాగ్యశ్రీ బోర్సే చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
రామ్ పోతినేనితో పెళ్లి

టాలీవుడ్ లేటెస్ట్ క్రష్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) లేటెస్ట్ కామెంట్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో భాగ్యశ్రీ డేటింగ్ లో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేసేలా భాగ్యశ్రీ చెప్పిన మాటలున్నాయి. రామ్ పోతినేనినే పెళ్లి చేసుకుంటానని భాగశ్రీ చెప్పకనే చెప్పిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇంటర్వ్యూలో
లెనిన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సేకు ఒక ఇంట్రెస్టింగ్ రాపిడ్ ఫైర్ ప్రశ్న ఎదురైంది. సెలబ్రిటీల టాక్ షోలలో ఎంతో పాపులర్ అయిన "ఫ్రెండ్, మ్యారీ, డేట్" (Friend, Marry, Date) టాస్క్‌ను యాంకర్ ఆమెకు ఇచ్చారు.
హీరోలలో ఎవరితో స్నేహం చేస్తావు? ఎవరితో డేటింగ్ వెళ్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? అని అడిగారు. దీనికి భాగ్యశ్రీ ఏమాత్రం తడబడకుండా చాలా తెలివిగా, సరదాగా సమాధానమిచ్చి అందరినీ ఆకట్టుకుంది.
అఖిల్ అక్కినేని ఫ్రెండ్
మొదటగా లెనిన్ హీరో అఖిల్ తనకు మంచి ఫ్రెండ్ అని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. "అఖిల్ చాలా మంచి వ్యక్తి, సెట్స్‌లో ఎంతో సపోర్ట్ చేస్తారు. అందుకే ఆయన నాకు ‘ఫ్రెండ్’ గానే సెట్ అవుతారు" అని భాగ్యశ్రీ పేర్కొంది. దీంతో అఖిల్‌ను ఆమె సేఫ్‌గా ఫ్రెండ్ జోన్‌లో పెట్టేసిందని అక్కినేని ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఉన్నది ఒక్కరే
ఇక అసలైన ట్విస్ట్ పెళ్లి, డేటింగ్ ప్రశ్న దగ్గర వచ్చింది. టాలీవుడ్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు లేదా డేటింగ్ చేస్తావు అన్న ప్రశ్నకు భాగ్యశ్రీ ఒక లాజికల్ అండ్ క్రేజీ రీజన్ వెల్లడించింది.
{{/usCountry}}ఇక అసలైన ట్విస్ట్ పెళ్లి, డేటింగ్ ప్రశ్న దగ్గర వచ్చింది. టాలీవుడ్లో ఎవరిని పెళ్లి చేసుకుంటావు లేదా డేటింగ్ చేస్తావు అన్న ప్రశ్నకు భాగ్యశ్రీ ఒక లాజికల్ అండ్ క్రేజీ రీజన్ వెల్లడించింది.
{{/usCountry}}"నేను ఇప్పటివరకు నటించిన కో-స్టార్స్ అందరికీ అప్పటికే పెళ్లిళ్లు అయిపోయాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒకే ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మిగిలి ఉన్నారు.. ఆయనే.." అని భాగ్యశ్రీ క్యూట్ గా నవ్వేసింది. ఆ మిగిలింది రామ్ పోతినేని అని భాగ్యశ్రీ చెప్పకనే చెప్పిందనే కామెంట్లు వస్తున్నాయి.
ఆ రూమర్లు
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే కలిసి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ అప్పటి నుంచే వీళ్ల మధ్య ఏదో ఉందనే రూమర్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఒకే ప్లేస్ నుంచి వీళ్లు వేర్వేరుగా ఫొటోలు పోస్టు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు రామ్ తోనే పెళ్లి అని భాగ్యశ్రీ చెప్పడంతో, వీళ్ల రిలేషన్ షిప్ ఖాయమేనా అనే డౌట్ వస్తుంది.
మరోవైపు అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన రూరల్ డ్రామా లెనిన్ ఇవాళ (జూలై 10) థియేటర్లలో రిలీజైంది.