రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ నిరీక్షణ ముగిసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని జీ5 ఓటీటీ సోమవారం (మార్చి 9) అధికారికంగా వెల్లడించింది. ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈవారమే స్ట్రీమింగ్

భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ జనవరి 13న సంక్రాంతి సందర్భంగా రిలీజైంది. ఇప్పటికే అన్ని సంక్రాంతి సినిమాలు ఓటీటీలోకి వచ్చేయగా.. మొత్తానికి ఈ శుక్రవారం (మార్చి 13) నుంచి రవితేజ నటించిన ఈ సినిమా కూడా స్ట్రీమింగ్ కు వస్తోంది.
“నిరీక్షణ ముగిసింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ వచ్చేసింది. మార్చి 13న జీ5లో స్ట్రీమింగ్” అవుతుంది అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఒక నిమిషం 10 సెకన్లు ఉన్న మూవీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసింది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి అసలు కథేంటంటే?
ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరున్న కిషోర్ తిరుమల ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో రవితేజ ఒక సంపన్న వ్యాపారవేత్తగా నటించాడు. వ్యాపార పనుల మీద తరచుగా యూరప్ వెళ్లే హీరో.. అక్కడ ఒక యువతి ప్రేమలో పడతాడు.
ఆ పరిచయం వల్ల తన వైవాహిక జీవితంలో తలెత్తిన సంక్లిష్ట పరిస్థితులను అతడు ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ఎమోషనల్ జర్నీ నుంచి ఎలా బయటపడ్డాడు అనే అంశాలను దర్శకుడు వినోదాత్మకంగా చూపించాడు.
ఆకట్టుకున్న సంగీతం.. ఆశిక, డింపుల్ జోరు
ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా.. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
{{/usCountry}}ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా.. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు, ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
{{/usCountry}}డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. రవితేజ మార్క్ కామెడీ, ఎమోషనల్ డ్రామాను ఇష్టపడేవారు మార్చి 13 నుంచి జీ5లో 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'ని ఎంజాయ్ చేయొచ్చు.
ఈ సినిమాతోపాటు ఈవారం ఓటీటీలోకి ఫంకీ, నవాబ్ కేఫ్ లాంటి తెలుగు సినిమాలు కూడా ఓటీటీలోకి వస్తున్నాయి. వీటిని నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్ ఓటీటీలో చూడొచ్చు.