...
...
Next Story

BMW OTT Release Date: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్

సంక్రాంతి రేసులో నిలిచిన రవితేజ తాజా మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (BMW OTT Release Date) థియేటర్లలో మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 13న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ కానుంది.

Published on: Mar 1, 2026, 16:00:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (BMW) ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. పండగ సీజన్‌లో పెద్ద సినిమాల పోటీ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద 'బిలో యావరేజ్' టాక్‌తో సరిపెట్టుకుంది.

వాయిదాల తర్వాత.. ఎట్టకేలకు స్ట్రీమింగ్

BMW OTT Release Date: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్
BMW OTT Release Date: భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్

నిజానికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఫిబ్రవరి 13నే ఓటీటీలోకి రావాల్సి ఉంది. అయితే ఓటీటీ ఒప్పందాల్లో తలెత్తిన కొన్ని సాంకేతిక కారణాల వల్ల స్ట్రీమింగ్ రెండు సార్లు వాయిదా పడింది. దీంతో రవితేజ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్.. మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. నిజానికి ఫిబ్రవరి 13 అని, ఫిబ్రవరి 27 అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మార్చి 6 అని కూడా అన్నారు. కానీ తాజాగా మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ చేయాలని జీ5 నిర్ణయించినట్లు సమాచారం.

భర్త మహాశయులకు విజ్ఞప్తి అసలు కథేంటంటే?

ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరున్న కిషోర్ తిరుమల ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో రవితేజ ఒక సంపన్న వ్యాపారవేత్తగా నటించాడు. వ్యాపార పనుల మీద తరచుగా యూరప్ వెళ్లే హీరో.. అక్కడ ఒక యువతి ప్రేమలో పడతాడు.

ఆ పరిచయం వల్ల తన వైవాహిక జీవితంలో తలెత్తిన సంక్లిష్ట పరిస్థితులను అతడు ఎలా ఎదుర్కొన్నాడు? ఆ ఎమోషనల్ జర్నీ నుంచి ఎలా బయటపడ్డాడు అనే అంశాలను దర్శకుడు వినోదాత్మకంగా చూపించాడు.

ఆకట్టుకున్న సంగీతం.. ఆశిక, డింపుల్ జోరు

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks