భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ వాయిదాకు అసలు కారణం ఇదేనా.. రవితేజ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. కానీ దీని హక్కులు సొంతం చేసుకున్న జీ5 ఓటీటీ మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అయితే తాజాగా ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఆలస్యం వెనుక కారణం ఇదీ అంటూ వార్తలు వస్తున్నాయి.
రవితేజ, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ నటించిన మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా అప్పుడెప్పుడో సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజైంది. అయితే ఐదు వారాలు దాటినా ఓటీటీ రిలీజ్ మాత్రం కాలేదు. ఈ ఆలస్యానికి కారణమేంటో తెలియక అభిమానులు తికమక పడుతున్నారు. అటు జీ5 ఓటీటీ ఏమీ చెప్పడం లేదు. అయితే తాజాగా డబ్బింగ్ వెర్షన్లే దీనికి కారణమని రిపోర్టులు వస్తున్నాయి.

డబ్బింగ్ వెర్షన్ల వల్లే ఆలస్యమవుతోందా?
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ మొదటి ఫిబ్రవరి 13న వస్తుందన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 20కి వాయిదా పడిందని చెప్పారు. ఆ తేదీ కూడా దాటినా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. అయితే దీనికి కారణం ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్లే అని, జీ5 దీనిని తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయబోతోందని 123తెలుగు రిపోర్టు వెల్లడించింది.
ఆ డబ్బింగ్ అనుకున్నదాని కంటే ఆలస్యం కావడం వల్లే రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వెళ్తోందని ఆ రిపోర్టు తెలిపింది. సాధారణంగా జీ5 ఓటీటీ తన ప్లాట్‌ఫామ్ పై వచ్చే టాప్ సినిమాలను ఒరిజినల్ తోపాటు ఇతర భాషల్లోనూ తీసుకొస్తుంది. ఈ మధ్యే మన శంకరవరప్రసాద్ గారు మూవీని అయితే ఏకంగా ఏడు భాషల్లో తీసుకొచ్చింది.
ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీని కూడా అలాగే తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం. డబ్బింగ్ వెర్షన్లను సిద్ధం చేసి మార్చి తొలి వారంలో మూవీని డిజిటల్ ప్రీమియర్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మిగిలిన సంక్రాంతి సినిమాలన్నీ వచ్చేయగా.. ఈ మూవీ కోసమే ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ విశేషాలు
సంక్రాంతి 2026 కానుకగా జనవరి 13న విడుదలైన రవితేజ మూవీ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahasayulaku Wignyapthi). కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించుకుంది. రవితేజ తన మాస్ ఇమేజ్ పక్కనపెట్టి చేసిన ఈ సినిమా ఓ రకంగా అతని డిజాస్టర్లకు బ్రేక్ వేసింది. కానీ ఆశించిన విజయం మాత్రం ఇవ్వలేకపోయింది.
ఒక బిజినెస్ మ్యాన్ (రవితేజ) తన భార్య, విదేశీ పర్యటనలో పరిచయమైన మరో మహిళ మధ్య నలిగిపోయే కథ ఇది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. థియేటర్లో మిస్ అయిన వారు ఈ సినిమా కోసం మరి కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


