Bhogi Eglivaranga Song: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ అవతార్ లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి'. మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ రఫ్ అండ్ టఫ్ లుక్ తో అదరగొట్టగా, తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మేకర్స్.

సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఎగిలి వారంగా' పాటను అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో 1960ల కాలం నాటి పల్లెటూరి వాతావరణాన్ని, గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు ఈ పాటలో ఆవిష్కరించారు.
గ్రామీణ జీవనం, పటేల్ వ్యవస్థ ప్రతిబింబించేలా సాహిత్యం
భోగి మూవీ నుంచి వచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ ఎగిలి వారంగా తొలిసారి వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ పాట ఆరంభం నుంచే ఒక అచ్చమైన పల్లెటూరి అనుభూతిని ఇస్తుంది. ఊరి ప్రజల రోజువారీ కష్టం, వారి వృత్తులు, కుటుంబ బంధాలు, అప్పటి కాలంలో పటేల్ వ్యవస్థ పట్ల గ్రామస్తులు చూపించే గౌరవం, అదే సమయంలో రాచరిక దౌర్జన్యాలు ఎలా ఉండేవో పాటలో చాలా సహజంగా చూపించారు. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ నాటు పల్లెటూరి గెటప్స్‌లో చాలా పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయారు.
పాటకు ఆస్కార్ విజేత చంద్రబోస్ అందించిన సాహిత్యం అతిపెద్ద అసెట్ అని చెప్పాలి. పదాల కూర్పుతో పల్లె అందాలను, గ్రామస్తుల మనస్తత్వాలను అద్భుతంగా ఆవిష్కరించారు. ఫోక్ బీట్స్ అందించడంలో స్పెషలిస్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మరోసారి తన మార్క్ మాస్ ట్యూన్ తో ఆకట్టుకున్నారు.
జానపద గాయకుల ఎనర్జీ.. నవంబర్ 12న గ్రాండ్ రిలీజ్
నల్గొండ గద్దర్ నరసన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ తమ పవర్ ఫుల్ వాయిస్ తో ఈ పాటను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. పక్కా లోకల్ జానపద శైలిలో సాగే ఈ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సంపత్ నంది మేకింగ్ స్టైల్ కి తగ్గట్టుగా విజువల్స్ చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి.
{{/usCountry}}నల్గొండ గద్దర్ నరసన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ తమ పవర్ ఫుల్ వాయిస్ తో ఈ పాటను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లారు. పక్కా లోకల్ జానపద శైలిలో సాగే ఈ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. సంపత్ నంది మేకింగ్ స్టైల్ కి తగ్గట్టుగా విజువల్స్ చాలా గ్రాండ్ గా కనిపిస్తున్నాయి.
{{/usCountry}}శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డింపుల్ హయతి మరో కథానాయికగా నటిస్తుండగా, ఈ యాక్షన్ డ్రామాను నవంబర్ 12, 2026న థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి పాటతోనే భోగి ఆల్బమ్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.