Akanksha Death: హీరోయిన్ ఆకాంక్ష మృతి కేసులో ఊహించని ములుపు- సింగర్, అతని సోదరుడికి హైకోర్టు నోటీసులు- మూడేళ్ల తర్వాత!
Akanksha Dubey Death Case Singer Samar Singh Notice: మూడేళ్ల క్రితం వారణాసి హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన భోజ్‌పురి హీరోయిన్ ఆకాంక్ష దూబే కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది ఆత్మహత్య కాదు హత్యేనని ఆమె తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు స్పందించి నిందితులకు నోటీసులు జారీ చేసింది.
Akanksha Dubey Death Case Singer Samar Singh Notice: భోజ్‌పురి చిత్ర పరిశ్రమను కుదిపేసిన యువ నటి ఆకాంక్ష దూబే మృతి కేసులో న్యాయపోరాటం కొత్త మలుపు తిరిగింది. 2023 మార్చి 26న వారణాసిలోని ఒక హోటల్ గదిలో ఆమె శవమై కనిపించిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మూడేళ్ల తర్వాత నోటీసులు
తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న భోజ్‌పురి సింగర్ సమర్ సింగ్, అతని సోదరుడు సంజయ్ సింగ్‌లకు అలహాబాద్ హైకోర్టు మూడేళ్ల తర్వాత నోటీసులు జారీ చేసింది. తన కుమార్తెది ఆత్మహత్య కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని ఆరోపిస్తూ ఆకాంక్ష దూబే తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు సీరియస్
సార్నాథ్ పోలీసులు ఈ కేసును కేవలం ఆత్మహత్యగా తేల్చి పక్కన పెట్టడాన్ని బాధితురాలి తల్లి సవాల్ చేశారు. స్థానిక పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని, ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించాలని ఆమె కోరారు.
అఫిడవిట్ దాఖలు చేయాలని
ఈ పిటిషన్‌ను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, సార్నాథ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)ను ఈ వ్యవహారంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమైతే, మే 22న స్వయంగా కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
నేపథ్యం ఇదీ..
25 ఏళ్ల వయసులో, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో భోజ్‌పురి హీరోయిన్ ఆకాంక్ష దూబే మరణించారు. మరణానికి కొన్ని నిమిషాల ముందు ఆమె ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి వెక్కి వెక్కి ఏడవడం అప్పట్లో కలకలం రేపింది. ఆ వీడియోలో ఆమె నోరు మూసుకుని ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నెలల తరబడి జైలులో
ఆకాంక్ష దూబే మరణం తర్వాత సమర్ సింగ్, సంజయ్ సింగ్‌లు తనను వేధిస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు (Abetment to Suicide) అప్పట్లో వీరిని అరెస్ట్ చేశారు. సమర్ సింగ్ నెలల తరబడి జైలులో ఉండి నవంబర్ 2023లో బెయిల్‌పై విడుదలయ్యారు.
న్యాయం కోసం తల్లి పోరాటం
ఘటనా స్థలంలో ఎలాంటి ఆత్మహత్య లేఖ (Suicide Note) లభించకపోవడం, ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియోలో ఆకాంక్ష భయంతో కనిపించడం గమనిస్తే ఇది హత్యేనని ఆమె కుటుంబం బలంగా నమ్ముతోంది. మే 22న జరగనున్న తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
కోర్టు ఆగ్రహం
నిందితులకు నోటీసులు అందడం, పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న చీకటి కోణాలు, యువ నటీమణులపై జరుగుతున్న వేధింపుల అంశం ఈ కేసు ద్వారా మరోసారి చర్చకు వచ్చింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


