Bhooth Bangla 1st Day Box Office Collection: సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబోలో వచ్చిన 'భూత్ బంగ్లా' థియేటర్లలో సందడి చేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ హారర్ కామెడీ మూవీ, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ధురంధర్ 2 స్థాయిలో ఓపెనింగ్స్

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది 'ధురంధర్ 2' సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఆ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా 'భూత్ బంగ్లా' నిలిచింది. అక్షయ్ కుమార్ మార్క్ కామెడీకి, డైరెక్టర్ ప్రియదర్శన్ టేకింగ్ తోడవ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.
కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. హారర్ కామెడీ జానర్ సినిమాలకు సాధారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగా ఉంటాయనే అంచనాలను తలకిందులు చేస్తూ, మొదటి రోజే 1.3 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. దీని ద్వారా సుమారు రూ. 3.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కేవలం ప్రీ-సేల్స్ నుంచే రావడం విశేషం.
పెయిడ్ ప్రివ్యూలతో అదిరిపోయే ఆరంభం
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు 'పెయిడ్ ప్రివ్యూస్' నిర్వహించడం ఒక ట్రెండ్‌గా మారింది. 'ధురంధర్ 2' తరహాలోనే 'భూత్ బంగ్లా' చిత్రానికి కూడా గురువారం (ఏప్రిల్ 16) రాత్రి 9 గంటల నుంచే కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రివ్యూలు వేశారు. పరిమిత షోలు ఉన్నప్పటికీ, ఈ పెయిడ్ ప్రివ్యూల ద్వారానే సినిమాకు రూ. 3.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇది ట్రేడ్ అనలిస్టుల అంచనాలను మించిపోవడం గమనార్హం. టాక్ పాజిటివ్‌గా ఉండటంతో శుక్రవారం మార్నింగ్ షోల నుంచే థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.
రికార్డుల వేటలో 'భూత్ బంగ్లా'
మొదటి రోజు కలెక్షన్ల అంచనాలను పరిశీలిస్తే, భారత్‌లో భూత్ బంగ్లా చిత్రానికి రూ. 12 నుంచి రూ. 14 కోట్ల నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. పెయిడ్ ప్రివ్యూల మొత్తాన్ని కలిపితే, ఓపెనింగ్ డే కలెక్షన్లు దాదాపు రూ. 15 నుంచి రూ. 17 కోట్ల మధ్య ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
{{/usCountry}}మొదటి రోజు కలెక్షన్ల అంచనాలను పరిశీలిస్తే, భారత్‌లో భూత్ బంగ్లా చిత్రానికి రూ. 12 నుంచి రూ. 14 కోట్ల నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. పెయిడ్ ప్రివ్యూల మొత్తాన్ని కలిపితే, ఓపెనింగ్ డే కలెక్షన్లు దాదాపు రూ. 15 నుంచి రూ. 17 కోట్ల మధ్య ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
{{/usCountry}}హిందీలో వచ్చిన టాప్ హారర్ కామెడీ చిత్రాల జాబితాలో 'స్త్రీ 2', 'థామా', 'భూల్ భులయ్యా 3' తర్వాత నాలుగో స్థానంలో ఈ భూత్ బంగ్లా చిత్రం నిలవనుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. గతంలో హిట్టయిన 'భూల్ భులయ్యా 2' (రూ. 14.50 కోట్లు), 'స్త్రీ' (రూ. 8 కోట్లు), 'భేడియా' (రూ. 10 కోట్లు) రికార్డులను అక్షయ్ కుమార్ ఈ సినిమాతో చెరిపేసే అవకాశం ఉంది.
పాత కాంబినేషన్.. కొత్త అనుభూతి
ప్రియదర్శన్ దర్శకత్వంలో ఐదేళ్ల విరామం తర్వాత వచ్చిన హిందీ సినిమా ఇది. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు పరేష్ రావల్, టబు, రాజ్‌పాల్ యాదవ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్ - ప్రియదర్శన్ కాంబో అనగానే 'హేరా ఫేరి', 'భూల్ భులయ్యా' వంటి క్లాసిక్స్ గుర్తొస్తాయి.
ఆ మ్యాజిక్ ఈ సినిమాలోనూ కనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ (VFX), కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయని భూత్ బంగ్లాపై రివ్యూలు వస్తున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత అక్షయ్ కుమార్‌కు ఒక పక్కా కమర్షియల్ సక్సెస్ లభించినట్లేనని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.