మాతో ఎంత అసహ్యంగా ప్రవర్తించావో గుర్తుందా? గౌరవం, సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? హీరోయిన్ భూమికి టీచర్ కౌంటర్
Bhumi Pednekar Acting Teacher Recalls Disrespectful Behaviour: నీట్ నిరనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడిన విద్యార్థుల భాషను తప్పుపట్టిన నటి భూమి పెడ్నేకర్‌కు తన యాక్టింగ్ స్కూల్ టీచర్ గట్టి కౌంటర్ శ్రుతి దేశాయ్ ఇచ్చారు. మాతో ఎంత అసహ్యంగా ప్రవర్తించావో గుర్తుందా అంటూ నిలదీశారు.
Bhumi Pednekar Acting Teacher Recalls Disrespectful Behaviour: దేశవ్యాప్తంగా కలకలం రేపిన NEET-UG వివాదంపై జరిగిన ఆందోళనల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అసభ్యకరమైన పదజాలం వాడారంటూ బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ చేసిన వ్యాఖ్యలు ఆమెకే తిరగబడ్డాయి.

గౌరవ మర్యాదల గురించి
సాధారణంగా విద్యార్థుల సమస్యలపై, పోలీసుల లాఠీఛార్జీలపై స్పందించని భూమి, ప్రధాని పదవిని ఉద్దేశించి గౌరవ మర్యాదల గురించి మాట్లాడటంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రచ్చ జరుగుతుండగానే భూమి మాజీ యాక్టింగ్ టీచర్ శ్రుతి దేశాయ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
"మాతో ఎలా ప్రవర్తించావో గుర్తుందా?": యాక్టింగ్ టీచర్ ఘాటు కౌంటర్
ముంబైకి చెందిన ఒక ఫిల్మ్ స్కూల్‌లో భూమి పెడ్నేకర్‌కు నటనలో పాఠాలు నేర్పించిన శ్రుతి దేశాయ్, భూమి స్వభావాన్ని ప్రశ్నిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
"ముంబై ఫిల్మ్ స్కూల్‌లో నీకు కొద్దిరోజులు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయురాలిగా నేను ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుచేసుకోగలను. నీకు పాఠాలు నేర్పిన గురువుల పట్ల నువ్వు ఎంత అగౌవరంగా, అసహ్యంగా ప్రవర్తించేదానివో నాకు ఇప్పటికీ గుర్తుంది. మరి ఇప్పుడు హఠాత్తుగా గౌరవం, బాధ్యత, సంస్కారం గురించి మాట్లాడుతున్నావు.. ఈ మధ్యలో నీ ప్రపంచ దృక్పథం ఎలా మారిపోయిందో కాస్త వివరిస్తావా?" అని శ్రుతి దేశాయ్ ప్రశ్నించారు.
గతంలో గురువులను కనీసం మనుషులుగా కూడా గౌరవించని భూమి పెడ్నేకర్ ఇప్పుడు వేదికలపై సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నెటిజన్లు కూడా శ్రుతి వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు.
ప్రధానిపై భాష సరిగా లేదంటూ భూమి తొలి వీడియో
ఇటీవల విద్యార్థుల ఆందోళనల వీడియోలను ఉద్దేశించి భూమి పెడ్నేకర్ మాట్లాడారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని లేదా ఇంట్లోని పెద్దవారిని ఉద్దేశించి అలా మాట్లాడటం మన సంస్కృతి కాదని హితవు పలికారు.
"మన దేశ యువత మాట్లాడుతున్న తీరు, వాడుతున్న భాష నన్ను ఎంతగానో కలిచివేసింది. ప్రధాని వంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తితో మనం మాట్లాడే విధానం ఇది కాదు. కుటుంబంలో పెద్దలతో ఇలాగే మాట్లాడతామా? నిరసన తెలపడం హక్కే కావచ్చు, కానీ అసభ్య పదజాలం వాడటం సరైన పద్ధతి కాదు. సంస్కారం, విలువలే మనకి వెన్నుముక" అని భూమి పెడ్నేకర్ వ్యాఖ్యానించారు.
కేవలం ప్రధానిని అన్నారని
అయితే, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసినప్పుడు, పెల్లెట్ తుపాకులు వాడి దారుణంగా కొట్టినప్పుడు నోరు విప్పని భూమి పెడ్నేకర్ కేవలం ప్రధానిని అన్నారని ముందుకు రావడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హత్య బెదిరింపులు రావడంపై
నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ ఎదురవ్వడంతో భూమి మరో వీడియోను విడుదల చేశారు. అందులో ఆందోళనలో పాల్గొన్న ఒక విద్యార్థినికి అత్యాచార బెదిరింపులు, హత్య బెదిరింపులు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక చిన్నపిల్ల మనసులో అంతటి భయాన్ని నింపడం తప్పని, ఇటువంటి దాడిని ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
డ్యామేజ్ కంట్రోల్ డ్రామానా?
అయితే, భూమి విడుదల చేసిన రెండో వీడియో కేవలం తనపై వస్తున్న ట్రోలింగ్‌ను తప్పుదోవ పట్టించే 'డ్యామేజ్ కంట్రోల్' ప్రయత్నమేనని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల అసలు సమస్యల గురించి కాకుండా, కేవలం తన వైఖరిని సమర్థించుకోవడానికే ఆమె చూస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


