...
...
Next Story

Bigg Boss 10: మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ 10 లాంఛ్-ఫస్ట్ కంటెస్టెంట్ కన్ఫామ్? ఆ పోస్ట్ తో క్లారిటీ-ఓటీటీ కోసం ప్లాన్!

Bigg Boss 10: బిగ్ బాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ. మరికొన్ని గంటల్లోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో కొత్త సీజన్ లాంఛ్ కానుంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో హౌస్ లో అడుగుపెట్టే ఫస్ట్ కంటెస్టెంట్ పై క్లారిటీ వచ్చేసింది. ఆ పోస్టుతో జబర్దస్త్ కమెడియన్ కన్ఫామ్ చేశాడనే టాక్ వినిపిస్తోంది.

Published on: Sep 5, 2026, 21:51:10 IST
Advertisement

Bigg Boss 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ (Bigg Boss Telugu Season 10) ప్రారంభానికి వేళయైంది. రేపు (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌తో ఈ రియాలిటీ షో కొత్త సీజన్ ఘనంగా షురూ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, అప్‌డేట్లు ఈ సీజన్‌పై అంచనాలను పెంచేయగా, ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

జబర్దస్త్ రాంప్రసాద్

మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ 10 లాంఛ్-ఫస్ట్ కంటెస్టెంట్ కన్ఫామ్? ఆ పోస్ట్ తో క్లారిటీ-ఓటీటీ కోసం ప్లాన్! (x)
మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ 10 లాంఛ్-ఫస్ట్ కంటెస్టెంట్ కన్ఫామ్? ఆ పోస్ట్ తో క్లారిటీ-ఓటీటీ కోసం ప్లాన్! (x)

పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ రాంప్రసాద్ (జబర్దస్త్ ఆటో రాంప్రసాద్) బిగ్ బాస్ 10లో అడుగపెట్టడం ఖాయమైందని చెప్పొచ్చు. ఆయన సోషల్ మీడియా పోస్ట్ దీనికి కారణం. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. జబర్దస్త్ ప్రయాణానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం పక్కా

తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ రాంప్రసాద్ ఒక పోస్ట్ చేశారు. "జబర్దస్త్ ద్వారా ఇప్పటివరకు నా కామెడీని ఆస్వాదించి, నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ ప్రయాణం నాకు ఎంతో ప్రత్యేకమైనది. మీ ప్రేమ, మద్దతు వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను.

ఇప్పుడు నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఈ కొత్త ప్రయాణంలో కూడా మీ సపోర్ట్ ఇలాగే నా వెంటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్పు ఏదైనా సరే.. మీకోసం వినోదం మాత్రం పక్కాగా అందిస్తాను" అని రాంప్రసాద్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ వైపు

ఇప్పుడు అదే బాటలో రాంప్రసాద్ కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. రామ్ ప్రసాద్ టైమింగ్, పంచ్ డైలాగులకు బుల్లితెరపై ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

గ్రాండ్ లాంఛ్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ గ్రాండ్ గా లాంఛ్ కానుంది. మరోసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష సీజన్ 2 ముగిసింది. ఇక అటు సెలబ్రిటీల్లో, ఇటు కామనర్లలో ఎవరు హౌస్ లోకి అడుగుపెడతారనేది తెగ క్యూరియాసిటీ పెంచుతోంది. దీనిపై రేపు రాత్రి వరకూ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.

మరోవైపు జియోహాట్ స్టార్ ఓటీటీలో బిగ్ బాస్ 24*7 లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓటీటీ వ్యూయర్ షిప్ పెంచేందుకు మేకర్స్ కొత్త ప్లాన్ వేశారు. సోమవారం నుంచి శుక్రవారం ప్రతి రోజు సెలబ్రిటీలతో లైవ్ చాట్ చేసే ఛాన్స్ కల్పించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks