...
...
Next Story

షాకింగ్-బిగ్ బాస్ నుంచి ఇమ్మాన్యుయేల్ ఔట్‌-ఫ్యాన్స్ ఫైర్-ఇమ్ముకు క‌ళ్లు చెదిరే రెమ్యున‌రేష‌న్‌-15 వారాల‌కు ఎంతంటే?

కామెడీతో ఎంటర్ టైన్ చేసి, టాస్క్ ల్లో అదరగొట్టిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కు భారీ షాక్ తగిలింది. టైటిల్ రేసులో ఉంటాడని అనుకున్న ఇమ్ము బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడని తెలిసింది. అతను నాలుగో ప్లేస్ లో బయటకు వచ్చేశాడని టాక్. ఇమ్ము బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతో ఇక్కడ చూసేయండి.

Published on: Dec 21, 2025, 07:10:48 IST
Advertisement

బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. కచ్చితంటా టాప్-2లో నిలిచి, టైటిల్ కోసం పోటీపడతాడనేలా అంచనాలు పెంచిన ఇమ్మాన్యుయేల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు! కనీసం టాప్-3లో కూడా చోటు దక్కించుకోకుండా ఇమ్మాన్యుయేల్ ఔట్ అయ్యాడనే వార్త సంచలనంగా మారింది. అతను నాలుగో స్థానంతో హౌస్ వీడాల్సి వచ్చిందని అంటున్నారు. మరి ఇమ్మాన్యుయేల్ కు దక్కిన బిగ్ బాస్ రెమ్యునరేషన్ ఎంతో చూద్దాం.

ఇమ్మాన్యుయేల్ ఔట్

ఇమ్మాన్యుయేల్ (x)
ఇమ్మాన్యుయేల్ (x)

జబర్దస్త్ తో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయేల్. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో అడుగుపెట్టినప్పటి నుంచి కామెడీతో పాటు టాస్క్ ల్లోనూ అదరగొట్టాడు. ఎంటర్ టైనర్ అనిపించుకున్నాడు. ఎలిమినేషన్ అనే ప్రాబ్లెం లేకుండానే టాప్-5 వరకూ వచ్చేశాడు. అతను కచ్చితంగా టాప్-3లో ఉంటాడనిపించింది. కానీ ఫైనల్ ఓటింగ్ లో ఇమ్ముకు దెబ్బ పడిందని తెలిసింది. దీంతో నాలుగో స్థానంతోనే ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడని సమాచారం.

సూట్ కేస్ లేకుండానే

సాధారణంగా అయితే బిగ్ బాస్ ఫైనల్లో సూట్ కేస్ ఆఫర్ ఉంటుంది. ఒక సెలబ్రిటీ సూట్ కేస్ తో హౌస్ లోకి వెళ్తారు. టైటిల్ రేసు నుంచి తప్పుకొనేందుకు రూ.10 లక్షలు, రూ.20 లక్షలు ఇలా కంటెస్టెంట్లకు ఆఫర్ చేస్తారు. కంటెస్టెంట్లు ఆ డబ్బు తీసుకుని బయటకు రావొచ్చు. ఈ సారి ఆ సూట్ కేస్ ను ఇమ్ముకు ఇచ్చారనే టాక్ మొదట వినిపించింది. కానీ ఇప్పుడు సూట్ కేస్ కూడా లేకుండానే అతను ఎలిమినేట్ అయ్యాడని తెలిసింది.

బిగ్ బాస్ రెమ్యునరేషన్

బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ రేసు నుంచి ఇమ్మాన్యుయేల్ నిష్క్రమించాడనే వార్త తెలిసిన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జనాలు చివరకు ఓట్లు వేయలేదని అంటున్నారు. మరోవైపు బిగ్ బాస్ ఫ్రాడ్ అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎంటర్ టైనర్ ను గెలిపించరా? అని ప్రశ్నిస్తున్నారు. మరోసారి బిగ్ బాస్ ఓటింగ్ ఫేక్ అని సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks