బిగ్ బాస్ ఓటింగ్.. ఎవరికీ అందనంత ఎత్తులో కల్యాణ్.. టైటిల్ ఆర్మీ జ‌వాన్‌దేనా?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో టైటిల్ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఫినాలేకు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ సీజన్ లో తమకు నచ్చిన కంటెస్టెంట్ కోసం జనాలు ఓట్లు వేస్తున్నారు. ఓటింగ్ చూసుకుంటే కల్యాణ్ దూసుకెళ్లిపోతున్నాడు. 

Dec 16, 2025, 13:49:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ తెలుగు చరిత్రలో కొత్త రికార్డు నెలకొనబోతున్నట్లే కనిపిస్తోంది. సరికొత్త హిస్టరీకి రంగం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ గా పడాల కల్యాణ్ నిలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రస్తుత ఓటింగ్ చూస్తుంటే ఈ ఆర్మీ జవాన్ టైటిల్ కొట్టడం ఫిక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇతర కంటెస్టెంట్లకు అందనంత ఎత్తులో కల్యాణ్ నిలబడుతున్నాడు.

బిగ్ బాస్ 9 తెలుగు (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు (youtube)

బిగ్ బాస్ 9 ఓటింగ్

బిగ్ బాస్ 9 తెలుగు ఎండింగ్ దిశగా సాగుతోంది. ఈ సీజన్ లో ఇదే లాస్ట్ వీక్. ఫినాలే వీక్ లోనూ మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పడాల కల్యాణ్, తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజన గల్రానీ టాప్-5లో చోటు దక్కించుకున్నారు. ఫినాలే వీక్ కు వచ్చేశారు. వీళ్లలో తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించుకునేందుకు జనాలు ఓట్లు వేస్తున్నారు.

టాప్ లేపుతున్న కల్యాణ్

బిగ్ బాస్ ఓటింగ్ లో ఆర్మీ జవాన్ పడాల కల్యాణ్ టాప్ లేపుతున్నాడు. అతని ఆట, బిహేవియర్, క్యారెక్టర్ కు జనాలు జై కొడుతున్నారు. ఓటింగ్ లో కల్యాణ్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఫైనల్ ఓటింగ్ లో మంగళవారం (డిసెంబర్ 16) ప్రస్తుత పరిస్థితి చూస్తే కల్యాణ్ టాప్ లేపుతున్నాడు. ఫేవరెట్ తనూజాను దాటి మరీ ఓటింగ్ లో అదరగొడుతున్నాడు.

ఎంతో తేడా

ప్రస్తుతం బిగ్ బాస్ 9 తెలుగు ఓటింగ్ లో పడాల కల్యాణ్ టాప్ లో కొనసాగుతున్నాడు. తనూజ పుట్టస్వామి సెకండ్ ప్లేస్ లో ఉంది. వీళ్లిద్దరి మధ్య తేడా ఎంతో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కల్యాణ్ కు ఇప్పుడు 44.74 శాతం ఓటింగ్ ఉంది. అదే తనూజాకు ఏమో 27.32 శాతం ఓటింగ్ ఉంది. ఈ రకంగా చూసుకుంటే కల్యాణ్ చాలా ముందంజలో ఉన్నాడు.

ఈ ముగ్గురు

ఇక బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ రేసులో ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజన గల్రానీ వెనుకబడ్డారు. పవన్, తనూజ, ఇమ్మాన్యుయెల్ మధ్య ప్రధానంగా పోటీ ఉందని అంటున్నారు. కానీ ఓటింగ్ చూస్తే మాత్రం ఇమ్మాన్యుయెల్ (12.78 శాతం) కు షాక్ తప్పేలా లేదు.

ఇక డీమాన్ పవన్ (9.67 శాతం), సంజన గల్రానీ (5.49 శాతం) వరుసగా నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నారు. ఇంకో మూడు రోజులు ఇదే ఓటింగ్ ట్రెండ్ కొనసాగితే కల్యాణ్ ట్రోఫీతో హిస్టరీ క్రియేట్ చేసే అవకాశముంది. మరి చూడాలి బిగ్ బాస్ లాస్ట్ లో ఏం చేస్తాడో అనే కామెంట్లూ వస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More