...
...
Next Story

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని ట్విస్ట్.. ఈ బ్యూటీ ఎంట్రీతో ఆట మారుతుందా?

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో వైల్డ్ కార్డు 2.0తో కొత్త కంటెస్టెంట్లు రాబోతున్నారు. ఇప్పటికే గొడవలతో సాగుతున్న ఈ సీజన్ కు మరింత హైప్ క్రియేట్ చేయడం కోసం మేకర్స్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ వైల్డ్ కార్డు ఎంట్రీల్లో ఓ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుందని సమాచారం.

Published on: Oct 9, 2026, 06:12:54 IST
Advertisement

Bigg Boss Telugu 10: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సీజన్ సెప్టెంబర్ 6, 2026న ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభంలో మొత్తం 16 మంది వైవిధ్యమైన కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో.. ఇప్పటికే కొన్ని వారాల పాటు డ్రామా, ఎమోషన్స్, గట్టి పోటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

వైల్డ్ కార్డు ఎంట్రీ

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని ట్విస్ట్.. ఈ బ్యూటీ ఎంట్రీతో ఆట మారుతుందా?
బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని ట్విస్ట్.. ఈ బ్యూటీ ఎంట్రీతో ఆట మారుతుందా?

మిడ్ వీక్ ఎలిమినేషన్స్, ఊహించని ట్విస్టులతో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సాగుతోంది. ఈ నేపథ్యంలో షో రేటింగ్‌ను మరింత పెంచేందుకు సరికొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలను రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ఈ వీకెండ్ కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు.

శ్వేతా నాయుడు

ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, డాన్సర్ శ్వేతా నాయుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే టాక్ సోషల్ మీడియాలో ఒక పెద్ద సంచలనంగా మారింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే కంటెస్టెంట్లు ఎప్పుడూ హౌస్‌లో ఉండే పాత ఈక్వెషన్స్ ను మార్చేస్తుంటారు. శ్వేతా నాయుడు తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, బలమైన సోషల్ మీడియా ఫాలోయింగ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టడం వల్ల మిగిలిన కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఎదురుకావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికే హౌస్‌లో త్రిగుణ్, రోహిత్, ముఖేష్ గౌడ, వర్షిణి సౌందరరాజన్, టెంపర్ వంశీ వంటి కంటెస్టెంట్లు తమదైన శైలిలో గేమ్‌ను నడుపుతున్నారు. ఇప్పుడు శ్వేతా నాయుడు లాంటి గ్లామర్ అండ్ టాలెంట్ ఉన్న కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్‌లో సరికొత్త మైండ్ గేమ్స్, టాస్కుల్లో హీట్ పెరగడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.

ఢీ రన్నరప్

ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డ్యాన్స్ రీల్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ వ్లాగ్స్ ద్వారా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగింది. శ్వేతా నాయుడుకి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సేతో ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేసిన కవర్ సాంగ్స్, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

వీళ్లు కూడా

గతంలోనే శ్వేతా నాయుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తుందనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఈ మైలురాయి సీజన్ 10లో వైల్డ్ కార్డ్ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆమె సిద్ధమైంది. శ్వేతా నాయుడుతో పాటు నీతు నటరాజ్, శివ్ కుమార్, నవరసాలు ఆర్కే, కావ్య శ్రీ కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks