Bigg Boss 10 Buzz: బిగ్ బాస్ సీజన్ 7లో తనదైన నైజంతో, పంచ్‌లతో ప్రేక్షకులను అలరించి టాప్ కంటెస్టెంట్‌గా నిలిచిన శివాజీ.. మరోసారి హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తారు. గత సీజన్ లో బిగ్ బాస్ బజ్ లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లతో నిజాలు రాబట్టిన ఆయన.. మరోసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
బిగ్ బాస్ 10 బజ్

బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బయటకు రాగానే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసేందుకు బిగ్ బాస్ బజ్ అనే ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ఇది స్టార్ మా మ్యూజిక్ లో ప్రసారమవుతుంది. ఈ బజ్ కు ప్రతి సీజన్ కు హోస్ట్ లు మారుతూ వచ్చారు. అంతకుముందు సీజన్లోని స్టార్ కంటెస్టెంట్లు తర్వాతి సీజన్ బిగ్ బాస్ బజ్ కు హోస్ట్ లుగా చేశారు. కానీ శివాజీ మాత్రం వరుసగా హోస్ట్ గా కొనసాగుతుండటం విశేషం.
ఆట కాదు వేట
బిగ్ బాస్ బజ్ లో తనదైన డైనమిజంతో కంటెస్టెంట్లను వణికించారు శివాజీ. ఇప్పుడు కొత్త సీజన్ కోసం ప్రోమోతోనే వణికించే ప్రయత్నం చేశారు. హౌస్‌మేట్స్‌ను హాట్ సీట్‌లో కూర్చోబెట్టి, వారు చేసిన తప్పులను, ఆడిన డబుల్ గేమ్‌లను ఏమాత్రం దాచకుండా నిలదీసేందుకు శివాజీ పక్కా ప్లాన్‌తో వస్తున్నారు.
"ఇది ఆట కాదు.. వేట!" అంటూ మేకర్స్ విడుదల చేసిన ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో బిగ్ బాస్ జర్నీ, నిజం అంటూ తూకం వేసే శివాజీ కొత్తగా కనిపించారు.
స్టార్ మా మ్యూజిక్‌లో డబుల్ ధమాకా
ఇక స్టార్ మాలో అంతకుముందు రాత్రి వచ్చిన బిగ్ బాస్ ఎపిసోడ్ తో పాటు కాస్త కంటెంట్ పొడిగించి తర్వాతి రోజు స్టార్ మా మ్యూజిక్ లో రిపీట్ చేసే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 10 సీజన్ కోసం కూడా స్టార్ మా ఈ ప్లాన్ ఫాలో అవుతుంది.
{{/usCountry}}ఇక స్టార్ మాలో అంతకుముందు రాత్రి వచ్చిన బిగ్ బాస్ ఎపిసోడ్ తో పాటు కాస్త కంటెంట్ పొడిగించి తర్వాతి రోజు స్టార్ మా మ్యూజిక్ లో రిపీట్ చేసే సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 10 సీజన్ కోసం కూడా స్టార్ మా ఈ ప్లాన్ ఫాలో అవుతుంది.
{{/usCountry}}సెప్టెంబర్ 7వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ బిగ్ బాస్ బజ్ షో.. ప్రతిరోజూ రెండు వేర్వేరు సమయాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయం 10:00 గంటలకు, సాయంత్రం 6:00 PM కి స్టార్ మా మ్యూజిక్ ఛానెల్‌లో ఈ అన్‌ఫిల్టర్డ్ ఎపిసోడ్లు ప్రసారమవుతాయి.
శివాజీనే ఎందుకు?
బిగ్ బాస్ బజ్ షోకు శివాజీనే హోస్ట్ గా ఎందుకు కొనసాగిస్తున్నారనే ప్రశ్నలు రావడం కామన్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలకు యూట్యూబ్, సోషల్ మీడియాలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.
సాధారణంగా టాక్ షో హోస్ట్‌లు కంటెస్టెంట్లతో డిప్లొమాటిక్‌గా వ్యవహరిస్తారు. కానీ శివాజీ ముక్కుసూటితనం, నిజాయితీగా మాట్లాడే మనస్తత్వం వల్ల ఇంటర్వ్యూలు పొలిటికల్ డిబేట్లను తలపించేలా పవర్‌ఫుల్‌గా సాగుతాయి. ఇది షో వ్యూయర్‌షిప్‌ను విపరీతంగా పెంచుతుంది.