Bigg Boss 10 Fight: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో ఊహించని దారుణం జరిగింది. నామినేషన్స్ వేడి తగ్గుముఖం పట్టకముందే కంటెస్టెంట్లు అమన్ మసూద్ (Aman Masud), త్రిగుణ్ (Thrigun) మధ్య జరిగిన తీవ్రమైన గొడవ హౌస్‌లో ఫిజికల్ ఎటాక్ వరకు వెళ్లింది. అసభ్యకర పదం వాడాడనే ఆరోపణలతో అమన్.. త్రిగున్‌పై చెయ్యి చేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది.
కెప్టెన్సీ టాస్క్‌లో చెలరేగిన రచ్చ.. మణికట్టు పట్టుకుని నలిపేసిన అమన్

ఈ వారంలో అపూర్వ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హౌస్‌మేట్స్‌ను రెండు గ్రూపులుగా విభజించి ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ గేమ్ ఆడుతున్న సమయంలో అమన్.. త్రిగుణ్ మణికట్టును చాలా గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. నొప్పితో అరిచిన త్రిగున్.. అమన్ పదే పదే అలాగే చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
వెంటనే పైకి లేచి అమన్ ముఖం ముందుకు వచ్చి గట్టిగా అరవడం ప్రారంభించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన అమన్.. త్రిగుణ్ ను గట్టిగా వెనక్కి తోసేయడంతో గొడవ ఫిజికల్ ఫైట్‌గా మారింది. మిగతా హౌస్‌మేట్స్ వచ్చి ఇద్దరినీ పట్టుకుని పక్కకు లాగాల్సి వచ్చింది.
'లం.. వర్డ్' ఆరోపణలు.. ఏడ్చేసిన అమన్
గొడవ ముదురుతున్న సమయంలో త్రిగుణ్ తనను ఉద్దేశించి ఒక అత్యంత అసభ్యకరమైన పదాన్ని (లం.. పదం) వాడాడని అమన్ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. త్రిగుణ్ ను 'చీప్' అని పిలుస్తూ అతని వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అమన్ ఆవేశం కంట్రోల్ కాకపోవడంతో మిగతా కంటెస్టెంట్లు అతని నోటిపై చేతులు పెట్టి ఆపాల్సి వచ్చింది.
మరోవైపు త్రిగుణ్ తన మణికట్టు చూపిస్తూ అమన్ తనను దారుణంగా గాయపరిచాడని వాపోయాడు. కెప్టెన్ అపూర్వ వచ్చి త్రిగుణ్ ను ప్రశ్నించగా, "నువ్వు ఆ మాట నా నోటి నుంచి విన్నావా? ఎవరి మాటలో విని నన్ను ఎలా నిందిస్తావ్?" అంటూ ఆమెపై కూడా త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. అసలు ఆధారాలే లేకుండా తనపై అంత పెద్ద ఆరోపణ ఎలా చేస్తారని నిలదీశాడు.
నెటిజన్ల షాక్.. అమన్‌కి రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందేనా?
{{/usCountry}}మరోవైపు త్రిగుణ్ తన మణికట్టు చూపిస్తూ అమన్ తనను దారుణంగా గాయపరిచాడని వాపోయాడు. కెప్టెన్ అపూర్వ వచ్చి త్రిగుణ్ ను ప్రశ్నించగా, "నువ్వు ఆ మాట నా నోటి నుంచి విన్నావా? ఎవరి మాటలో విని నన్ను ఎలా నిందిస్తావ్?" అంటూ ఆమెపై కూడా త్రిగుణ్ ఫైర్ అయ్యాడు. అసలు ఆధారాలే లేకుండా తనపై అంత పెద్ద ఆరోపణ ఎలా చేస్తారని నిలదీశాడు.
నెటిజన్ల షాక్.. అమన్‌కి రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందేనా?
{{/usCountry}}ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన వెంటనే ఎక్స్ లో ఈ ఫైట్ క్లిప్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం హౌస్‌లో ఫిజికల్ వైలెన్స్ లేదా అత్యంత బూతు పదాలు వాడితే నేరుగా 'రెడ్ కార్డ్' ఇచ్చి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది.
అమన్ అంత దారుణంగా చెయ్యి చేసుకోవడం తప్పు అని, అతనికి ఖచ్చితంగా రెడ్ కార్డ్ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. త్రిగుణ్ కావాలనే బూతులు తిట్టి అమన్‌ను రెచ్చగొట్టాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ మా, ఎండెమోల్ షైన్ ఇండియా యాజమాన్యం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆడియెన్స్ కోరుతున్నారు.
కింగ్ నాగార్జున వీకెండ్ క్లాస్.. బిగ్ బాస్ ఏం చేయబోతున్నారు?
శని, ఆదివారాల్లో వచ్చే వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఈ ఇష్యూపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త్రిగుణ్ నిజంగానే ఆ అసభ్యకర పదాన్ని వాడాడా లేదా అనేది ఫుటేజ్ చెక్ చేసి నాగ్ తేల్చనున్నారు.
ఒకవేళ అమన్ చేసిన ఫిజికల్ ఎటాక్ లేదా త్రిగుణ్ వాడిన బూతులు నిరూపణ అయితే ఈ వారంలో ఊహించని ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9:00 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ఈ ఎపిసోడ్లు ప్రసారమవుతున్నాయి. అలాగే జియోహాట్‌స్టార్ (JioHotstar) లో కూడా వీటిని డిజిటల్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.