Bigg Boss 10 Telugu: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ పదో సీజన్ ను ఫస్ట్ వీక్ నుంచే ఇంట్రెస్టింగ్ గా కొనసాగిస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ చోటు చేసుకుందని తెలిసింది. వైల్డ్ కార్డుగా అడుగుపెట్టిన మిథిలేష్ బయటకు వచ్చాడని టాక్.
బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీ

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలకు అపూర్వ, మిథిలేష్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు ఓట్లు వేస్తే లీస్ట్ ఓట్లు వేసిన అపూర్వను హౌస్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత నవరసాలు ఆర్కే, మిథిలేష్ కు టాస్క్ పెట్టారు. అందులో గెలిచిన మిథిలేష్ హౌస్ లోకి వెళ్లాడు.
వీకెండ్ ట్విస్ట్
ఇప్పటికే బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మిథిలేష్ కంటెస్టెంట్ అయిపోయాడు. హౌస్ లో ఉంటున్నాడు. అయితే ఈ వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ మిథిలేష్ కు బంపరాఫర్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది. ఇది పెద్ద ట్విస్ట్ అని సమాచారం. డబ్బు ఆశతో మిథిలేష్ హౌస్ ను వదిలేశాడని తెలిసింది. దీంతో హౌస్ మేట్స్ షాక్ అయ్యారని టాక్.
రూ.15 లక్షలు
బిగ్ బాస్ 10 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ కోసం సిగ్మా మూవీ హీరో సందీప్ కిషన్, డైరెక్టర్ జేసన్ సంజయ్ వచ్చారని సమాచారం. వీళ్లు వచ్చి మిథిలేష్ కు ఆఫర్ ఇచ్చారంటా. సూట్ కేస్ తో వచ్చి మనీ తీసుకొని బయటకు వెళ్లమన్నారంటా. ఫస్ట్ రూ.5 లక్షలు, ఆ తర్వాత రూ.10 లక్షలు, చివరగా రూ.15 లక్షలు ఆఫర్ చేశారని టాక్.
ప్రైజ్ మనీ నుంచి కట్
ఆ రూ.15 లక్షలు తీసుకొని బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి వెళ్లిపోయేందుకు మిథిలేష్ ఓకే చెప్పాడని తెలిసింది. అయితే ఆ డబ్బును ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తామని బిగ్ బాస్ చెప్పడంతో మిగతా కంటెస్టెంట్లు ఒప్పుకోలేదని టాక్. అయితే మిగతా కంటెస్టెంట్లను ఒప్పించి ఆ సూట్ కేసుతో మిథిలేష్ బయటకు వచ్చాడని అంటున్నారు.
{{/usCountry}}ఆ రూ.15 లక్షలు తీసుకొని బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ నుంచి వెళ్లిపోయేందుకు మిథిలేష్ ఓకే చెప్పాడని తెలిసింది. అయితే ఆ డబ్బును ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తామని బిగ్ బాస్ చెప్పడంతో మిగతా కంటెస్టెంట్లు ఒప్పుకోలేదని టాక్. అయితే మిగతా కంటెస్టెంట్లను ఒప్పించి ఆ సూట్ కేసుతో మిథిలేష్ బయటకు వచ్చాడని అంటున్నారు.
{{/usCountry}}మరి మిథిలేష్ నిజంగానే ఆ డబ్బును తీసుకొని వెళ్లిపోయాడా? లేదా స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత మళ్లీ ఏమైనా ట్విస్ట్ చోటు చేసుకుంటుందా? నాగార్జున ఏమైనా చేశారా? అన్నది ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాతే తెలుస్తుంది.