...
...
Next Story

Bigg Boss 10 Contestants List: బిగ్ బాస్ 10 తెలుగు కంటెస్టెంట్ల కంప్లీట్ లిస్ట్.. సెలబ్రిటీలు ఎవరు? కామనర్లు ఎవరు?

Bigg Boss 10 Contestants List: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ వచ్చేసింది. ఇక 15 వారాలు బుల్లితెర ఆడియన్స్ కు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ గ్యారెంటీ. ఇవాళ బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్ గా లాంఛ్ అయింది. మరి హౌస్ లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీలు ఎవరు? కామనర్లలో ఎవరికి ఛాన్స్ దక్కిందో చూసేయండి.

Updated on: Sep 6, 2026, 22:29:43 IST
Advertisement

Bigg Boss 10 Contestants List: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అయిపోయింది. తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ బాస్ 10 తెలుగు వచ్చేసింది. ఇవాళ (సెప్టెంబర్ 6) గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ షోలోకి వచ్చిన కంటెస్టెంట్లు వీళ్లే.

దేబ్జానీ మోదక్

బిగ్ బాస్ 10 తెలుగు కంటెస్టెంట్ల కంప్లీట్ లిస్ట్.. సెలబ్రిటీలు ఎవరు? కామనర్లు ఎవరు?
బిగ్ బాస్ 10 తెలుగు కంటెస్టెంట్ల కంప్లీట్ లిస్ట్.. సెలబ్రిటీలు ఎవరు? కామనర్లు ఎవరు?

సీరియల్ హీరోయిన్ దేబ్జానీ మోదక్ బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లోకి ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ స్టార్ మా పాపులర్ సీరియల్ ‘ఎన్నెన్మో జన్మల బంధం’తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైంది దేబ్జానీ.

త్రిగుణ్

తెలుగు హీరో త్రిగుణ్ సెకండ్ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చాడు. అతని రియల్ నేమ్ అరుణ్ అదిత్. అయితే కొత్త పేరు త్రిగుణ్ తో అతను హౌస్ లోకి వచ్చాడు. రీసెంట్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీలో కీ రోల్ ప్లే చేశాడు త్రిగుణ్.

సింగర్ ఝాన్సీ

బిగ్ బాస్ 10 తెలుగులోకి మూడో కంటెస్టెంట్ గా సింగర్ ఝాన్సీ అడుగుపెట్టింది. అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్ గెలుచుకుని నేరుగా హౌస్ కు అర్హత సాధించింది ఝాన్సీ.

సుధీర్ రెడ్డి

యూట్యూబ్ లో పాడ్ కాస్ట్ షోతో పాపులర్ అయిన సెలబ్రిటీ సుధీర్ రెడ్డి. అతను నాలుగో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లాడు.

అమన్

మరో సీరియల్ నటి చైత్ర రాయ్ కూడా హౌస్ లోకి వచ్చింది. అష్టా చెమ్మా సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కు చైత్ర పరిచయమే.

రాంప్రసాద్

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ కూడా బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంటర్ టైన్ చేయడం లేదు కాబట్టి స్టేజీ పై నుంచే పంపించేద్దామని రాంప్రసాద్ తో నాగార్జున ఆడుకుంటాడు. చివరకు లోపలికి పంపిస్తాడు.

శాలిని

అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ లోకి వెళ్లిన మూడో కంటెస్టెంట్ శాలిని. నవదీప్ వచ్చి శాలినిని సెలెక్ట్ చేస్తాడు.

టెంపర్ వంశీ

టాలీవుడ్ లో విలన్ రోల్స్ తో అదరగొడుతున్న టెంపర్ వంశీ బిగ్ బాస్ లోకి వెళ్లాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ మూవీతో వంశీకి మంచి పేరు వచ్చింది.

సృష్టి వ్యాక‌ర‌ణం

బిగ్ బాస్ 10లోకి మరో కామనర్ గా సృష్టి వ్యాక‌ర‌ణం అడుగుపెట్టింది. సృష్టి వ్యాక‌ర‌ణం ఓ మోడల్. అగ్నిపరీక్షలో ఆమె అదరగొట్టింది. యాంకర్ శ్రీముఖి వచ్చి సృష్టిని సెలెక్ట్ చేసింది.

నరేష్

జబర్దస్త్ లో తన కామెడీ, పంచ్ లతో నవ్వించే నరేష్ కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. ‘‘లో నరేష్ అని కొడితే.. ‘బిగ్ బాస్ 10 తెలుగు విన్నర్’ అని రావాలి’’ అని నరేష్ స్టేజీపై చెప్తాడు. నరేష్ ను ప్యాక్ చేసి హౌస్ లోకి పంపించడం హైలైట్ గా నిలిచింది.

ఆర్జే చరణ్

అగ్నిపరీక్ష నుంచి ఆర్జే చరణ్ కూడా బిగ్ బాస్ హౌస్ కు సెలెక్ట్ అయ్యాడు. ఆడియన్స్ ఓటింగ్ తో అతను ఈ సీజన్ లో అడుగుపెట్టాడు.

కృష్ణుడు

వినాయకుడు సినిమాతో హీరోగా ఎంటర్ టైనర్ చేసిన కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేశాడు. కమెడియన్ గానూ అతను అలరించిన సంగతి తెలిసిందే.

వర్షిణి సౌందరరాజన్

హాట్ యాంకర్, నటి వర్షిణి సౌందరరాజన్ బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ ఎపిసోడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సెలబ్రిటీ కంటెస్టెంట్ గా ఆమె హౌస్ లోకి వెళ్లింది.

రోహిత్ రాయుడు

అగ్నిపరీక్ష నుంచి లాస్ట్ కామనర్ గా రోహిత్ నాయుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి వెళ్లాడు. బిందు మాధవి వచ్చి అతణ్ని ఎంపిక చేసింది.

నిహార్ ముఖేష్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి లాస్ట్ కంటెస్టెంట్ గా నిహార్ ముఖేష్ అడుగుపెట్టాడు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లొ ‘రిషి’గా తెలుగు ఆడియన్స్ అందరికీ ముఖేష్ తెలిసినవాడే.

మొత్తం 16 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి వెళ్లారు. ఇందులో 10 మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్లున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks