Bigg Boss 10: తెలుగు టీవీ, ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఈ క్రేజీ షో కొత్త సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ కానుంది.
బిగ్ బాస్ 10 తెలుగు

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న స్టార్ట్ కానుంది. ఇప్పటికే మేకర్స్ దీనిపై అనౌన్స్ మెంట్ వీడియోలు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరు? అనేది ఉత్కంఠగా మారింది.
రైతు బిడ్డ
బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి మెయిన్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఫస్ట్ కంటెస్టెంట్ సెలెక్ట్ అయిందనే ప్రచారం జోరందుకుంది. ఆమె ఎవరో కాదు.. సింగర్ ఝాన్సీనే. తన ఆటతో, పాటతో అదరగొడుతున్న ఈ రైతు బిడ్డ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో కనిపించబోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఆడపులి
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష ఆడిషన్ కు వచ్చినప్పటి నుంచి సింగర్ ఝాన్సీ తన ఆత్మవిశ్వాసంతో ఆకట్టుకుంటూనే ఉంది. తన పాటలతో, పొలం పనులతో పాపులర్ అయిన ఝాన్సీ బిగ్ బాస్ అగ్నపరీక్షలో కూడా టాస్క్ ల్లో అదరగొట్టింది. ఆడపిల్లను కాదు ఆడపులిని అని చెప్పుకొన్న ఝాన్సీ.. టాస్క్ ల్లో సత్తాచాటి ఆ మాటలు వంద శాతం నిజమనిపించింది.
ఫస్ట్ కంటెస్టెంట్
బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు ఎంపికైన ఫస్ట్ కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ అని తెలిసింది. ఆమె హౌస్ లో అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు. మరోసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ కానుంది.
{{/usCountry}}బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు ఎంపికైన ఫస్ట్ కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ అని తెలిసింది. ఆమె హౌస్ లో అడుగుపెట్టడం ఖాయమని అంటున్నారు. మరోసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ కానుంది.
{{/usCountry}}సింగర్ ఝాన్సీ బ్యాక్ గ్రౌండ్
సింగర్ ఝాన్సీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఆమెది సూర్యాపేట జిల్లా. చివ్వెం మండంలోని కోమటికుంట గ్రామానికి చెందిన ఝాన్సీ స్వతహాగా పాటలు పాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. జానపద పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
పొలం పనులు చేస్తూ, పాటలు పాడుతూ ఆ వీడియోలు, వ్లాగ్ లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటుంది. చదువులోనూ ఝాన్సీ సూపర్ అనిపించింది. ఆర్గానికి కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసింది.