...
...
Next Story

Bigg Boss 10 Remuneration: షాకింగ్.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ లీక్.. వామ్మో ఆ సెలబ్రిటీకి అన్ని లక్షలా?

Bigg Boss 10 Remuneration: పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు మళ్లీ వచ్చేసింది. ఆదివారం బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ గ్రాండ్ గా లాంఛ్ అయింది. సెలబ్రిటీలు, కామనర్లు కలిపి 16 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా వీళ్ల రెమ్యూనరేషన్ లీక్ అయింది. మేకర్స్ ఎవరికి ఎంత ఇస్తున్నారో చూసేయండి.

Published on: Sep 7, 2026, 12:38:52 IST
Advertisement

Bigg Boss 10 Remuneration: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’ గ్రాండ్ గా లాంఛ్ అయింది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ 'దశావతారం' థీమ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్లు 100 రోజుల పాటు కఠినమైన టాస్కులు, సవాళ్లు ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.

బిగ్ బాస్ 10 రెమ్యునరేషన్

షాకింగ్.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ లీక్.. వామ్మో ఆ సెలబ్రిటీకి అన్ని లక్షలా? (x/starmaa)
షాకింగ్.. బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ లీక్.. వామ్మో ఆ సెలబ్రిటీకి అన్ని లక్షలా? (x/starmaa)

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో పార్టిసిపేట్ చేస్తున్న కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ వివరాలు హాట్టాపిక్ గా మారాయి. మరి ఈ సీజన్ లో పాల్గొంటున్న సెలబ్రిటీలు, కామనర్లకు బిగ్ బాస్ నిర్వాహకులు ఎంత పారితోషికం ఇస్తున్నారనేది సోషల్ మీడియాలో లీక్ అయింది.

టాప్ రాంప్రసాద్

జబర్దస్త్ కామెడీ షోతో బాగా పాపులర్ అయిన ఆటో రాంప్రసాద్ కు ఈ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో హైయ్యస్ట్ రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నట్లు తెలిసింది. అతనికి వారానికి రూ.4.5 లక్షలు ఇస్తున్నట్లు టాక్. ఎంటర్ టైనర్ కేటగిరీలో హౌస్ లోకి వచ్చిన రాంప్రసాద్ పై మంచి అంచనాలే ఉన్నాయి.

హాట్ బ్యూటీ

హాట్ యాంకర్, నటి వర్షిణి సౌందరరాజన్ కు కూడా మేకర్స్ భారీగానే చెల్లిస్తున్నారని సమాచారం. ఇన్ స్టాలో 1 మిలియన్ ప్లస్ సబ్ స్క్రైబర్లు ఉన్న ఈ బ్యూటీకి వారానికి ఏకంగా రూ.3.5 లక్షలు ఆఫర్ చేసినట్లు తెలిసింది.

ఇక సీరియల్ హీరో ముఖేష్ గౌడకు వారానికి రూ.3 లక్షలు ఇస్తున్నట్లు టాక్. 'గుప్పెడంత మనసు' సీరియల్‌తో తెలుగు ఇళ్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ముఖేష్.

వీళ్లకు ఇలా (వారానికి)

  • ​దేబ్‌జాని మోదక్: రూ.2,75,000
  • ​కృష్ణుడు: రూ.2,00,000
  • ​త్రిగుణ్ / అదిత్ అరుణ్: రూ.2,75,000
  • ​జబర్దస్త్ నరేష్: రూ.2,50,000
  • ​చైత్రా రాయ్: రూ.2,50,000
  • ​టెంపర్ వంశీ: రూ.2,00,000
  • ​యాంకర్ సుధీర్ రెడ్డి: రూ.1,25,000

​కామనర్లకు భారీ ఆఫర్

బిగ్ బాస్ ఒప్పందం ప్రకారం కంటెస్టెంట్లకు ఈ మొత్తాన్ని ఒకేసారి అందజేయరు. ఎలిమినేట్ అయిన లేదా ఫైనల్ చేరుకున్న నెల రోజుల్లోపు ఒప్పందంలో ఉన్న మొత్తంలో 80 శాతాన్ని చెల్లిస్తారు. మిగిలిన 20 శాతం నిధిని షో నిబంధనలు, అగ్రిమెంట్ కండిషన్లు పూర్తిగా పాటించిన తర్వాతే విడుదల చేస్తారని సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks