Bigg Boss Remuneration: బిగ్ బాస్ హోస్ట్‌ల సంచలన రెమ్యూనరేషన్.. టాప్ లో సల్మాన్ ఖాన్.. సౌరభ్ గంగూలీ, నాగార్జునకు ఇలా!
Bigg Boss Remuneration: బిగ్ బాస్ బిజినెస్ మోడల్ భారత్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. వేర్వేరు భాషల్లో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్, నాగార్జున, విజయ్ సేతుపతి, సౌరవ్ గంగూలీ, మోహన్ లాల్, కిచ్చా సుదీప్‌ల భారీ రెమ్యూనరేషన్ వివరాలు ఇవే.
Bigg Boss Remuneration: కంటెస్టెంట్లు, గొడవలు, ఊహించని డ్రామాతో ఆకట్టుకునే 'బిగ్ బాస్' రియాలిటీ షో ప్రస్తుతం భారతీయ బుల్లితెరపై అత్యంత విలువైన కమర్షియల్ ప్రాపర్టీగా మారింది. ప్రతి శని, ఆదివారాల్లో వీక్షకులను టీవీలకు కట్టిపడేసే హోస్ట్‌లే ఈ బిగ్ బాస్ ఫ్రాంచైజీకి ప్రధాన వ్యాపార ఆస్తిగా మారిపోయారు. హిందీ నుంచి దక్షిణాది భాషల వరకు ఈ షోను నడిపిస్తున్న సెలబ్రిటీల రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

టాప్ లో సల్మాన్ ఖాన్
హిందీ బిగ్ బాస్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సల్మాన్ ఖాన్. నాలుగో సీజన్ నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్.. వీకెండ్ ఎపిసోడ్లను ఒక ప్రత్యేకమైన ఈవెంట్‌లా మార్చేశారు. వెరైటీ ఇండియా నివేదిక ప్రకారం, సల్మాన్ ఒక పూర్తి సీజన్‌కు దాదాపు రూ.200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ప్రతి వీకెండ్ ఎపిసోడ్‌కు ఆయన ఛార్జ్ చేసే ఫీజు రూ.15 కోట్ల కంటే ఎక్కువేనని సమాచారం.
దాదా గంగూలీ
బెంగాలీ బిగ్ బాస్ సీజన్ 3కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏకంగా రూ.125 కోట్లకు పైగా ప్యాకేజీని దక్కించుకోవడం విశేషం. క్రీడా ప్రపంచం నుంచి వచ్చిన దాదాకు ఉన్న విపరీతమైన ప్రజాదరణ ఈ రీజినల్ షోకు పెద్ద బలంగా మారింది.
విజయ్ కు ఇలా
తమిళ బిగ్ బాస్‌లో కమల్ హాసన్ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రతి వీకెండ్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు అందుకుంటున్నారు. ఒక పూర్తి సీజన్‌కు ఆయన పారితోషికం రూ.75 కోట్ల నుంచి రూ.80 కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నాగార్జునకు ఎంతంటే?
ఇక తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. 2019 నుంచి హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన కింగ్ నాగార్జున పారితోషికం ఏటికేడాది గణనీయంగా పెరిగింది. మొదట్లో సీజన్‌కు రూ.10 కోట్ల వరకు తీసుకున్న నాగార్జున, 2025 నాటికి ఆ ఫీజును దాదాపు రూ.35 కోట్లకు పెంచేసినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు ఆయన రూ.40 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.
మలయాళంలో ఆరంభం నుంచే బిగ్ బాస్‌కు బ్రాండ్‌గా మారిన మోహన్ లాల్ ఒక సీజన్‌కు దాదాపు రూ.30 కోట్లు తీసుకుంటున్నారు. ఈ షో కోసం ఆయన కేవలం 20 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటారు.
కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ ఒక సీజన్‌కు రూ.20 కోట్ల వరకు అందుకుంటున్నారు. వీకెండ్ ఎపిసోడ్‌కు ఆయన పారితోషికం దాదాపు రూ.2 కోట్లుగా ఉంది.
జియోహాట్ స్టార్ ప్లాన్
ఒకప్పుడు కేవలం హిందీ టీవీ రంగానికే పరిమితమైన బిగ్ బాస్, ప్రస్తుతం ఆరు ప్రధాన భాషల్లో భారీ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది. జియోహాట్ స్టార్ ఈ ఆరు భాషల (హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం) బిగ్ బాస్ ఎడిషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఒకేసారి ప్రసారం చేస్తోంది.
వ్యాపార పరంగా ఈ మల్టీ-లాంగ్వేజ్ వ్యూహం గొప్ప ఫలితాలను ఇస్తోంది. ఈ ఆరు భాషల ఎడిషన్లకు కలిపి 95 కంటే ఎక్కువ ప్రముఖ స్పాన్సర్‌షిప్ బ్రాండ్లు ముందుకు రావడం గమనార్హం.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


