Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హోస్ట్ నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లో ఇప్పుడు సీక్రెట్ రూమ్ ఉందా లేదా? అనే విషయంపై వీడియోలతో సహా క్లారిటీనిచ్చారు. అలాగే తన స్టైల్లో మాస్ వార్నింగ్ కూడా ఇచ్చిన ప్రోమో వైరల్ గా మారింది.
బిగ్ బాస్ 10 ప్రోమో

బిగ్ బాస్ 10 తెలుగు ఫస్ట్ వీకెండ్ ప్రోమో కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూశారు. ఎందుకంటే మిడ్ వీక్ లోనే చరణ్, చైత్ర రాయ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఇక త్రిగుణ్ వర్సెస్ రోహిత్ అనే గొడవ సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున వచ్చి ఏం చెప్తారు? ఎలా మాట్లాడతారు? అనే క్యూరియాసిటీ కలిగింది. తాజాగా ఆ ప్రోమో రిలీజైంది.
మహా పరీక్ష
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మహా పరీక్ష గురించి హోస్ట్ నాగార్జున మరోసారి గుర్తు చేశారు. హౌస్ లోకి 16 మంది వస్తే ఇద్దరు వెళ్లిపోయారని నాగార్జున చెప్పారు. ముగ్గురు హౌస్ మేట్స్ అయ్యారని తెలిపారు. ఇంకా 11 మంది హై రిస్క్ లోనే ఉన్నారని కూడా నాగ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోని సీక్రెట్ రూమ్ పై క్లారిటీనిచ్చారు.
నో సీక్రెట్ రూమ్
ఫస్ట్ వీక్, అది కూడా మిడ్ వీక్ లోనే చరణ్, చైత్ర రాయ్ ను ఎలిమినేట్ చేయడం అనేది ఎందుకో ఆడియన్స్ కు, కంటెస్టెంట్లకు నమ్మశక్యంగా అనిపించడం లేదు. అందుకే నాగార్జున రాగానే కంటెస్టెంట్లను ఇదే మాట అడిగారు. చైత్ర, చరణ్ సీక్రెట్ రూమ్ లో ఉన్నారని అనుకుంటున్నారు కదా అని నాగ్ అడిగితే.. అవును అని కంటెస్టెంట్లు చెప్పారు.
కానీ చరణ్, చైత్ర వీడియోలను ప్లే చేసి మరీ ఇప్పుడు సీక్రెట్ రూమ్ లేదని నాగార్జున క్లారిటీనిచ్చారు. ఆ వీడియోల్లో చరణ్, చైత్ర ఇద్దరూ తమ ఇళ్లలోనే ఉన్నామని చెప్పారు. దీంతో కంటెస్టెంట్లు షాక్ కు గురయ్యారు.
నాగార్జున వార్నింగ్
{{/usCountry}}కానీ చరణ్, చైత్ర వీడియోలను ప్లే చేసి మరీ ఇప్పుడు సీక్రెట్ రూమ్ లేదని నాగార్జున క్లారిటీనిచ్చారు. ఆ వీడియోల్లో చరణ్, చైత్ర ఇద్దరూ తమ ఇళ్లలోనే ఉన్నామని చెప్పారు. దీంతో కంటెస్టెంట్లు షాక్ కు గురయ్యారు.
నాగార్జున వార్నింగ్
{{/usCountry}}ప్రోమో చివర్లో కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆటలో ఏ మాత్రం అలసత్వం చూపించినా హౌస్ నుంచి వెళ్లిపోక తప్పదని హెచ్చిరించారు. మరి ఈ రోజు (సెప్టెంబర్ 12) రాత్రి 9 గంటలకు వచ్చే ఎపిసోడ్ లో కంటెస్టెంట్ల ప్రదర్శనపై నాగార్జున ఎలాంటి సంచలన కామెంట్లు చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.