Bigg Boss 10: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌బాస్ తెలుగు' పదో సీజన్ ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ క్రమంలో షోలో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్ల జాబితాపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అయితే, ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్‌లో ఒక ప్రముఖ సీరియల్ నటి పేరు బలంగా వినిపిస్తోంది.
బిగ్ బాస్ లోకి చైత్ర

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి ఓ సీరియల్ నటి ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్. ఆమెనే.. చైత్ర రాయ్. ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలోనూ నటించి మెప్పించిన బుల్లితెర గ్లామర్ క్వీన్ చైత్ర రాయ్ (Chaitra Rai) బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైందంటూ ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
బుల్లితెరపై చైత్ర రాయ్
కర్ణాటకకు చెందిన చైత్ర రాయ్.. కన్నడ పరిశ్రమ ద్వారా నటనలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగు బుల్లితెరపైనే విశేష ఆదరణ సంపాదించుకున్నారు. 'అష్టా చమ్మా' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'రాధా కళ్యాణం', 'ఒక్క క్షణం', 'తథాస్తు' వంటి వరుస సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.
ఆ సీరియల్ తో పాపులర్
ముఖ్యంగా జీ తెలుగులో ప్రసారమైన పాపులర్ సీరియల్ 'అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు' లో చైత్ర రాయ్ నటనకు విశేష ప్రశంసలు దక్కాయి. శ్రావణి, ధరణి అనే రెండు విభిన్న మనస్తత్వాలు ఉన్న అక్కాచెల్లెలిగా ద్విపాత్రాభినయంలో ఆమె చూపించిన అభినయం ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రతికూల ఛాయలున్న శ్రావణి పాత్రలో ఆమె పండించిన విలనిజం, హోమ్లీగా కనిపించే ధరణి పాత్రలోని గ్రేస్ ఆమె నటనలోని వైవిధ్యాన్ని నిరూపించాయి.
'దేవర' చిత్రంతో
కేవలం సీరియళ్లకు మాత్రమే పరిమితం కాకుండా వెండితెరపై కూడా చైత్ర తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రం 'దేవర'లో ఆమె ఒక కీలక పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్శించారు. ఈ సినిమా విజయం తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది.
{{/usCountry}}కేవలం సీరియళ్లకు మాత్రమే పరిమితం కాకుండా వెండితెరపై కూడా చైత్ర తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ చిత్రం 'దేవర'లో ఆమె ఒక కీలక పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్శించారు. ఈ సినిమా విజయం తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది.
{{/usCountry}}బిగ్‌బాస్ 10 ఎంట్రీ
ప్రతి సీజన్‌లోనూ బుల్లితెర నుంచి పాపులర్ నటీనటులను బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకురావడం నిర్వాహకులకు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి చైత్ర రాయ్ గ్లామర్, ఆమెకున్న ఫ్యాన్ బేస్, నటనతో పాటు ఆమెకున్న బోల్డ్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సనాలిటీ షోకి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాయని తెలిసిందే. చైత్రకు ఉన్న డిమాండ్ మేరకు భారీగానే రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని టాక్. చైత్ర రాయ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెడితే గ్లామర్‌తో పాటు గేమ్ ప్లాన్ పరంగా కూడా షో మరింత ఆసక్తికరంగా మారడం ఖాయమని బుల్లితెర విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.