Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మైల్ స్టోన్ లాంటి పదో సీజన్ ఆడియన్స్ కు వరుసగా ట్విస్టులు ఇస్తుంది. జనరల్ గా అయితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య పోటీ పెట్టి ప్రతి వారం కెప్టెన్ ను సెలక్ట్ చేస్తారు. కానీ బిగ్ బాస్ 10 సెకండ్ వీక్ లో మాత్రం ఆ పవర్ ను జనాలకు ఇచ్చారు.
బిగ్ బాస్ 10 తెలుగు

ఆటలో సవాలు కాదు ఆటే సవాలంటూ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ఫస్ట్ వీక్ మహా పరీక్ష పెట్టారు. కంటెస్టెంట్లుగా హౌస్ లోకి అడుగుపెట్టిన వాళ్లు హౌస్ మేట్స్ గా మారేందుకు టాస్కులు పెట్టారు. ఇక మిడ్ వీక్ లోనే ఇద్దరి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ మామూలు షాక్ ఇవ్వలేదు. వీకెండ్ లో మాత్రం నో ఎలిమినేషన్ అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు.
పవర్ ఆఫ్ పీపుల్
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ప్రతి వారం ఆటను సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ వీక్ హౌస్ మేట్స్ కావడానికి మహా పరీక్ష నిర్వహించారు. ఇక సెకండ్ వీక్ అంతా ఆడియన్స్ చేతుల్లోనే ఉందని హోస్ట్ నాగార్జున చెప్పారు. ‘పవర్ ఆఫ్ పీపుల్’ అంటూ కాన్సెప్ట్ పరిచయం చేశారు. బిగ్ బాస్ 10 తెలుగులో సెకండ్ వీక్ కెప్టెన్ ను ఎంచుకొనే అవకాశాన్ని జనాలకు ఇచ్చారు.
ఏం చేయాలంటే?
పవర్ ఆఫ్ పీపుల్ కాన్సెప్ట్ లో భాగంగా బిగ్ బాస్ 10 తెలుగు సెకండ్ వీక్ లో కెప్టెన్ గా చూడాలనుకుంటున్న కంటెండర్ ను జనాలు సెలెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 14 మంది ఉన్నారు. ఈ 14 మంది కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉన్నారు. వీళ్లలో తమకు నచ్చిన కంటెస్టెంట్ కు జనాలు మిస్డ్ కాల్ ద్వారా ఓట్లు వేయొచ్చు. ఓట్లు ఎక్కువ వచ్చిన హౌస్ మేట్స్ మధ్య కెప్టెన్సీ కోసం ఫైట్ జరుగుతుంది.
ఎప్పటివరకు?
{{/usCountry}}పవర్ ఆఫ్ పీపుల్ కాన్సెప్ట్ లో భాగంగా బిగ్ బాస్ 10 తెలుగు సెకండ్ వీక్ లో కెప్టెన్ గా చూడాలనుకుంటున్న కంటెండర్ ను జనాలు సెలెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 14 మంది ఉన్నారు. ఈ 14 మంది కెప్టెన్సీ కంటెండర్ రేసులో ఉన్నారు. వీళ్లలో తమకు నచ్చిన కంటెస్టెంట్ కు జనాలు మిస్డ్ కాల్ ద్వారా ఓట్లు వేయొచ్చు. ఓట్లు ఎక్కువ వచ్చిన హౌస్ మేట్స్ మధ్య కెప్టెన్సీ కోసం ఫైట్ జరుగుతుంది.
ఎప్పటివరకు?
{{/usCountry}}బిగ్ బాస్ 10 తెలుగు సెకండ్ వీక్ లో కెప్టెన్సీ కంటెండర్స్ ను డిసైడ్ చేయడం కోసం ఆడియన్స్ ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఓటింగ్ లైన్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. ఇవాళ (సెప్టెంబర్ 14) మధ్యాహ్నం 12 గంటల వరకే ఇవి ఓపెన్ గా ఉంటాయి. ఆ తర్వాత ఓటింగ్ వేయలేరు. అందుకే వెంటనే మీకు నచ్చిన కంటెస్టెంట్ ను కెప్టెన్సీ రేసులో నిలబెట్టేందుకు ట్రై చేసేయండి.