ఇవాళే బిగ్ బాస్ 9 ఫినాలే.. మరికొన్ని గంటల్లో తేలిపోనున్న విన్నర్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?
ఆడియన్స్ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ 9 తెలుగు ఫినాలే ఇవాళే. రాత్రి 7 గంటలకు ఈ గ్రాండ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అలాగే ఈవెంట్ కు వచ్చే చీఫ్ గెస్ట్ ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.
15 వారాలు.. 105 రోజుల సంగ్రామం. ఎంతో మంది కంటెస్టెంట్లు. మధ్యలో వైల్డ్ కార్డు ఎంట్రీలు.. చివరకు మిగిలేది ఒకే ఒక్కరు. నిలిచేది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరూ అనేది ఈ రోజే తేలిపోనుంది. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ విన్నర్ ఎవరో అనౌన్స్ అవుతుంది. ఆదివారమే గ్రాండ్ ఫినాలే.

బిగ్ బాస్ 9 ఫినాలే
బిగ్ బాస్ 9 తెలుగు సమరానికి క్లైమాక్స్. విజేత ఎవరో తేలే రోజు వచ్చేసింది. మరికొన్ని గంటల్లోనే ట్రోఫీని ముద్దాడే కంటెస్టెంట్ ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది. డిసెంబర్ 21న రాత్రి 7 గంటల నుంచి ఫినాలే స్టార్ట్ అవుతుంది. జియోహాట్ స్టార్ ఓటీటీలోనూ ఈ ఫైనల్ ను చూడొచ్చు.
విన్నర్ ఎవరు?
ఇప్పుడు అందరి ఫోకస్ బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు? అనేదానిపైనే ఉంది. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడుస్తోంది. హౌస్ లో టాప్-5లో నిలిచిన పడాల కల్యాణ్, తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్ ఫినాలేకు చేరారు. అయితే ఇందులో సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అవుతారని తెలిసింది. ఈ రోజు ఫినాలేలో ఫస్ట్ ఈ ఇద్దరు కంటెస్టెంట్లను రేసు నుంచి తప్పిస్తారని సమాచారం.
ఇద్దరు కామనర్లు
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ మధ్య సాగింది. ఇప్పుడు టాప్-3లో కల్యాణ్, తనూజ, డీమాన్ పవన్ ఉంటారు. వీళ్లలో కల్యాణ్, పవన్ ఇద్దరూ కామనర్లు కావడం విశేషం. చివరకు కల్యాణ్, తనూజ మధ్య టైటిల్ వార్ జరిగే అవకాశముంది. మరి ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారనే ఉత్కంఠ ఉపేస్తోంది.
చీఫ్ గెస్ట్
బిగ్ బాస్ సీజన్లలో ఫినాలేకు చీఫ్ గెస్ట్ గా ఓ ప్రముఖ సెలబ్రిటీ వచ్చి విజేతను అనౌన్స్ చేస్తుంటారు. గత కొన్నేళ్లలో మెగాస్టార్ చిరంజీవి ఎక్కువ సార్లు వచ్చారు. దీంతో ఈ సారి కూడా మెగాస్టార్ రాబోతున్నారనే టాక్ వినిపించింది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ప్రమోషన్ కోసం చిరు వస్తారనే ప్రచారం కొనసాగింది. కానీ మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ది రాజాసాబ్ ప్రమోషన్లలో భాగంగా డార్లింగ్ ప్రభాస్ వస్తారని అన్నారు.
చివరకు ఇప్పుడు లేటెస్ట్ బజ్ ప్రకారం మాస్ మహారాజ్ రవితేజ ఈ సారి బిగ్ బాస్ సీజన్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని తెలిసింది. భర్త మహాశయులకు విజ్ణప్తి సినిమాతో రవితేజ సంక్రాంతి రేసులోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి రవితేజ బిగ్ బాస్ ఫినాలేకు వచ్చి విజేతకు ట్రోఫీ అందిస్తారని తెలిసింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












