...
...
Next Story

బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే మరో ఆరు రోజుల్లోనే.. ఆ ఐదుగురి మధ్య టైటిల్ కోసం టఫ్ ఫైట్

బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలేకు రంగం సిద్ధమైంది. వచ్చే ఆదివారం (డిసెంబర్ 21) ఈ ఫినాలే ఉండనున్నట్లు స్టార్ మా అనౌన్స్ చేసింది. టాప్ 5 కంటెస్టెంట్స్ టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు.

Published on: Dec 15, 2025, 18:36:07 IST
By , Hyberabad
Prefer HTon Google
Advertisement

బిగ్ బాస్ 9 తెలుగు క్లైమ్యాక్స్ కు చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో మొత్తానికి 107 రోజుల తర్వాత గ్రాండ్ ఫినాలేకు సిద్ధమైంది. మరో ఆరు రోజుల్లోనే అంటూ ఈ విషయాన్ని స్టార్ మా ఛానెల్ సోమవారం (డిసెంబర్ 15) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. దీంతో ఈసారి విజేత ఎవరో అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే

బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే మరో ఆరు రోజుల్లోనే.. ఆ ఐదుగురి మధ్య టైటిల్ కోసం టఫ్ ఫైట్
బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే మరో ఆరు రోజుల్లోనే.. ఆ ఐదుగురి మధ్య టైటిల్ కోసం టఫ్ ఫైట్

బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలేలో హౌస్‌లో ఉన్న చివరి ఐదుగురు కంటెస్టెంట్లు టైటిల్ కోసం పోటీ పడబోతున్నారు. ఈ ఫినాలే విషయాన్ని స్టార్ మా తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. “టాప్ 5 ఫేస్ ఆఫ్.. ఎపిక్ గ్రాండ్ ఫినాలే కోసం సిద్ధంగా ఉండండి. బిగ్ బాస్ తెలుగు 9 సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మాలో.. జియోహాట్‌స్టార్ లో 24 గంటలూ స్ట్రీమింగ్” అనే క్యాప్షన్ తో ఈ పోస్ట్ చేసింది.

గ్రాండ్ ఫినాలేలో టైటిల్ కోసం సంజన, ఇమ్మాన్యుయెల్, డిమాన్ పవన్, తనూజ, కల్యాణ్ పోటీ పడనున్నారు. ఈ ఐదుగురూ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ మరో ఆరు రోజుల్లో గ్రాండ్ ఫినాలే అని స్టార్ మా వెల్లడించింది. అంటే వచ్చే ఆదివారం (డిసెంబర 21) ఈ ఫినాలే జరగనుంది.

బిగ్ బాస్ 9 తెలుగు ఇప్పటి వరకూ ఇలా..

ఊహించని ఎలిమినేషన్స్, అనూహ్యమైన ట్విస్టులు, గొడవలు, అరుపులు, సోల్జర్ కార్డ్స్, సింపతీ గేమ్స్, ఏడుపులు, టాస్క్‌లతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బాగానే సాగింది. బిగ్ బాస్ హౌజ్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వారిలో టాప్ 3 నుంచి టాప్ 5 ఫైనలిస్ట్‌లను హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

ఈ ఇద్దరిలోనే బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ విన్నర్ రానున్నారని సమాచారం. అయితే ఇప్పుడున్న టాప్ 5 ఫైనలిస్ట్‌లలో ముగ్గురు బిగ్ బాస్ తెలుగు 9 విజేతగా నిలిచి ట్రోఫీ ఎత్తితే బిగ్ బాస్ చరిత్రలోనే ఎవరు క్రియేట్ చేయని రికార్డ్ నమోదు అవుతుందని రివ్యూవర్స్ విశ్లేషిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe