బిగ్ బాస్ హౌజ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్స్- ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు విన్నర్ అయినా చరిత్ర సృష్టించినట్లే- ఎందుకంటే?
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఇంకో వారంలో ముగిసిపోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం హౌజ్‌లో టాప్ 5 ఫైనలిస్ట్స్ ఉన్నారు. వీరిలో టాప్ 2లో తనూజ గౌడ, కల్యాణ్ పడాల విన్నర్ రేసులో దూసుకుపోతున్నారు. ఈ ఐదుగురిలో ముగ్గురు బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ అయితే బీబీ హిస్టరీలో సరికొత్త చరిత్ర సృష్టించినట్లు అవనుందని టాక్.
ఊహించని ఎలిమినేషన్స్, అనూహ్యమైన ట్విస్టులు, గొడవలు, అరుపులు, సోల్జర్ కార్డ్స్, సింపతీ గేమ్స్, ఏడుపులు, కన్నీళ్లు, టాస్క్‌లతో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బాగానే సాగింది. ఇక మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ముగిసిపోనుంది. అందుకు సుమారుగా ఇంకో వారం ఉందనుకోవచ్చు.

టాప్ 2 ఫైనలిస్ట్స్
మొన్నటి వరకు బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండేవారు. వారిలో మొదటి ఫైనలిస్ట్‌గా కల్యాణ్ పడాల నిలిస్తే రెండో ఫైనలిస్ట్‌గా స్థానం సంపాదించుకుంది. ఇకపోతే గతవారం అంటే బిగ్ బాస్ 9 తెలుగు 14వ వారం డబుల్ ఎలిమినేషన్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
శనివారం నాటి ఎపిసోడ్‌లో కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం నాడు సీరియల్ నటుడు భరణి శంకర్ రెండోసారి ఎలిమినేషన్‌కు గురయ్యాడు. బిగ్ బాస్ హౌజ్‌లో ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. వారిలో టాప్ 3 నుంచి టాప్ 5 ఫైనలిస్ట్‌లను హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ
టాప్ 3 ఫైనిలిస్ట్‌గా డిమాన్ పవన్ నిలవగా.. టాప్ 4లో ఇమ్మాన్యూయెల్ ప్లేస్ సంపాదించుకున్నాడు. ఇక టాప్ 5 ఫైనలిస్ట్‌గా బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రానీ నిలిచింది. అయితే, ఈ టాప్ 5 ఫైనలిస్ట్‌లలో తనూజ గౌడ వర్సెస్ కల్యాణ్ పడాల మధ్యే బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ రేసు గట్టిగా జరుగుతోంది.
ఈ ఇద్దరిలోనే బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ విన్నర్ రానున్నారని సమాచారం. అయితే, ఇప్పుడున్న టాప్ 5 ఫైనలిస్ట్‌లలో ముగ్గురు బిగ్ బాస్ తెలుగు 9 విజేతగా నిలిచి ట్రోఫీ ఎత్తితే బీబీ చరిత్రలోనే ఎవరు క్రియేట్ చేయని రికార్డ్ నమోదు అవుతుందని రివ్యూవర్స్ విశ్లేషిస్తున్నారు.
తనూజ గౌడ విన్నర్ అయితే!
ఒకవేళ బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ విజేతగా సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి నిలిస్తే.. టీవీ సీజన్‌లోనే (ఓటీటీ సీజన్‌లో బిందు మాధవి విజేత) మొదటి లేడి విన్నర్ అవుతుంది. తనూజపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ స్ప్రెడ్ అయింది. వాటన్నింటిని తట్టుకుని, గెలవాలనే పట్టుదల ఉంటే విజయం వరిస్తుందని తర్వాతి లేడి కంటెస్టెంట్స్‌కు ఉదాహరణగా నిలిస్తుందని ఓ రివ్యూవర్ చెప్పారు.
డిమాన్ పవన్ విజేతగా నిలిస్తే!
డిమాన్ పవన్ గనుక బిగ్ బాస్ విజేతగా నిలిస్తే పీఆర్ బ్యాచెస్‌కు గట్టి షాక్ తగిలినట్టే అని అంటున్నారు. సోల్జర్ కార్డ్, పూర్ ట్యాగ్ వేసుకున్న కల్యాణ్ పడాల పీఆర్ టీమ్ చాలా పెద్దదని, ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా ప్రమోట్ చేస్తారని రివ్యూవర్స్ చెబుతున్నారు. అలాంటి పీఆర్ టీమ్‌ను దాటి, ఏమాత్రం పీఆర్ లేకుండా జెన్యూన్ ఓట్లతో గెలిస్తే డిమాన్ పవన్ హిస్టరీ క్రియేట్ చేసినట్లే అంటున్నారు.
ఓ కమెడియన్ టైటిల్ విన్నర్ అయితే!
ఇక జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్ బిగ్ బాస్ విన్నర్ అయితే ఒక కమెడియన్ బీబీ విజేత అవ్వలేడనే ట్యాగ్‌ను చెరిపేసి సరికొత్త చరిత్ర సృష్టించినాడు అవుతుడాని టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు ఎంతోమంది కమెడియన్స్ బిగ్ బాస్ ఆడియెన్స్‌ను నవ్వించారు. కానీ, వారికి టైటిల్ విన్నర్ ట్రోఫీ అందలేదు.
అలాంటిది బిగ్ బాస్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు తన మాటలతో, చేతలతో నవ్వించడమే కాకుండా టాస్క్‌ల్లో కూడా రాణించి బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు ఇమ్మాన్యూయెల్. అలాంటి ఇమ్మాన్యూయెల్ విజేతగా నిలిస్తే కమెడియన్స్ అందరికి ఒక హోప్ ఇచ్చినట్లు అవుతుందని బీబీ విశ్లేషకుల అంచనా.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper












