పికిల్స్ పాప బ్యాగ్ ప్యాక్ చేసుకోవాల్సిందేనా.. ఎలిమినేషన్ ముప్పు.. ఇక అంతా బిగ్ బాస్ చేతులోనే!

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఏడో వారం పికిల్స్ పాప రమ్య మోక్ష ఎలిమినేషన్ కు దగ్గర్లో ఉంది. ప్రస్తుతం ఓటింగ్ చూస్తుంటే ఆమె హౌస్ వదిలి వెళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి. 

Oct 24, 2025, 13:06:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష జర్నీ ఒక్క వారానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఈ వారం ఎలిమినేషన్లో ఉన్న ఆమెకు ఓటింగ్ లో ఉన్న నెగెటివిటీనే ఇందుకు కారణం. మరి బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఏడో వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం.

బిగ్ బాస్ 9 తెలుగు ఎలిమినేషన్ (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు ఎలిమినేషన్ (youtube)

బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలు వచ్చాక మరింత హోరాహోరీగా మారుతుందనిపించింది. కానీ మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నట్లు అయిపోయింది పరిస్థితి. ఈ వారం హౌస్ నుంచి వెళ్లిపోయేందుకు ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఇందులో తనూజ, కల్యాణ్, దివ్య నిఖిత, సంజన గల్రానీ, రాము రాథోడ్, రీతు చౌదరీ, శ్రీనివాస్ సాయి, రమ్య మోక్ష ఉన్నారు.

బిగ్ బాస్ ఎలిమినేషన్

ఏడో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ట్రెండ్ ప్రకారం చూస్తే పికిల్స్ పాప రమ్య మోక్షను బయటకు పంపించాలని ఆడియన్స్ గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. నోటి దురుసు రమ్యకు ప్రాబ్లెంగా మారింది. తనూజ, కల్యాణ్ ల పర్సనల్ గురించి మాట్లాడటం, ఓవరాక్టింగ్ తదితర కారణాలతో జనాలు చిరాకు పడుతున్నారని తెలిసింది.

బిగ్ బాస్ ఓటింగ్

ఏడో వారం బిగ్ బాస్ ఓటింగ్ చూసుకుంటే రమ్య మోక్ష లాస్ట్ ప్లేస్ లో ఉంది. సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి టాప్ లో కొనసాగుతోంది. 37.71 శాతం ఓట్లతో ఆమె నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఆ తర్వాత కల్యాణ్ పడాల 20.53 శాతం ఓట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

దివ్య నిఖిత (9.64 శాతం), సంజన గల్రానీ (9 శాతం), రాము రాథోడ్ (8.62 శాతం), రీతు చౌదరీ (6.47 శాతం) ఓట్లతో వరుసగా మూడు, నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. శ్రీనివాస్ సాయి (4.75 శాతం) ఏడో స్థానంలో ఉన్నాడు. రమ్య మోక్ష 3.28 శాతం ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది.

ట్విస్ట్ ఉంటుందా?

లెక్క ప్రకారమైతే ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో వాళ్లను ఎలిమినేట్ చేస్తున్నామని బిగ్ బాస్ వాళ్లు చెప్తున్నారు. కానీ అది నిజం కాదన్నది జనాల మాట. ఎందుకంటే ఈ సీజన్ లో భరణి, శ్రీజ దమ్ము ఎలిమినేషన్ అందుకు నిదర్శనం. దీంతో బిగ్ బాస్ నచ్చినవాళ్లకు ఓటింగ్ తక్కువ వచ్చినా కచ్చితంగా హౌస్ లో కొనసాగిస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు రమ్య మోక్ష నోరేసుకుని పడిపోతుంది. ఇలాంటి వాళ్లు కావాలని హౌస్ లో ఉంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More