బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎండింగ్ దిశగా సాగిపోతోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో ఇప్పుడు 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. తనూజ పుట్టస్వామి, రీతు చౌదరి, డీమాన్ పవన్, పడాల కల్యాణ్, సంజన, భరణి, సుమన్ శెట్టి, ఇమ్యాన్యుయేల్ ఉన్నారు. గత వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయిపోయింది. మరి వీళ్లలో టాప్-5లో నిలిచేది ఎవరు? విన్నర్ గా ట్రోఫీని ముద్దాడేదెవరో? చూసేద్దాం.
బిగ్ బాస్ 9 టాప్ 5

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. 13వ వారం వచ్చేసరికి 8 మంది కంటెస్టెంట్లు మిగిలారు. ఇందులో టాప్-5 ఎవరు అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే అభిమానుల ఓటింగ్, సోషల్ మీడియా క్రేజ్, హౌస్ లో పర్ఫార్మెన్స్ బట్టి టాప్-5 వీళ్లే నంటూ క్రేజీ బజ్ ఒకటి తెగ వైరల్ గా మారింది. మరి ఆ టాప్-5 కంటెస్టెంట్ లు ఎవరన్నది సస్పెన్స్ రేపుతోంది.
అయిదుగురు వీళ్లే
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో టాప్-5లో కచ్చితంగా ఉండేలా కనిపిస్తున్న కంటెస్టెంట్లు తనూజ పుట్టస్వామి, పడాల కల్యాణ్, ఇమ్మాన్యుయేల్. వీళ్లు ముగ్గురు కచ్చితంగా టాప్-3లో ఉంటారని సోషల్ మీడియా, రివ్యూవర్లు కోడై కూస్తున్నారు. మరి టాప్-5లో నిలిచే మిగతా ఇద్దరు ఎవరూ అనే చర్చ సాగుతోంది. మిగిలిన వాళ్లను చూసుకుంటే భరణి, సంజన, రీతు, సుమన్ శెట్టి, పవన్ లో పవన్, సంజన కాస్త బెటర్ గా కనిపిస్తున్నారు.
అంటే తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ తో పాటు పవన్, సంజన కలిసి బిగ్ బాస్ 9 తెలుగు టాప్-5లో నిలిచే అవకాశముంది. ఒకవేళ ఏమైనా సమీకరణాలు మారి, ఓటింగ్ లోనూ భారీ తేడా వస్తే మాత్రం రీతు చౌదరి, భరణికి కూడా ఛాన్స్ దొరుకుతుందనే టాక్ వినిపిస్తోంది.
బిగ్ బాస్ విన్నర్
15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సమయాన్ని గడిపి, టాస్క్ లు ఆడి, కో కంటెస్టెంట్లను దాటుకుని ఒకరే విన్నర్ గా నిలుస్తారు. ఈ సారి 9వ సీజన్ లో ఆ విన్నర్ ఎవరనేది ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే ఓటింగ్, పర్ఫార్మెన్స్ రెండూ కలిపి చూసుకుంటే సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి విన్నర్ అయేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు. రివ్యూవర్లు కూడా ఇదే మాట చెబుతున్నారు.
హిస్టరీకి దగ్గరగా
{{/usCountry}}15 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సమయాన్ని గడిపి, టాస్క్ లు ఆడి, కో కంటెస్టెంట్లను దాటుకుని ఒకరే విన్నర్ గా నిలుస్తారు. ఈ సారి 9వ సీజన్ లో ఆ విన్నర్ ఎవరనేది ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే ఓటింగ్, పర్ఫార్మెన్స్ రెండూ కలిపి చూసుకుంటే సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి విన్నర్ అయేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అంటున్నారు. రివ్యూవర్లు కూడా ఇదే మాట చెబుతున్నారు.
హిస్టరీకి దగ్గరగా
{{/usCountry}}ఇప్పటివరకూ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో రెగ్యులర్ సీజన్లలో ఎప్పుడూ మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలవలేదు. ఓటీటీ బిగ్ బాస్ లో మాత్రం బిందు మాధవి టైటిల్ గెలిచింది. ఈ సారి తనూజ విజేతగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే టైటిల్ రేసులో కల్యాణ్ కూడా గట్టి పోటీనిస్తున్నాడు. ఓటింగ్ పరంగా చూస్తే వీళ్లిద్దరే టాప్ 2లో కొనసాగుతున్నారు. మరోవైపు ఇమ్మాన్యుయేల్ కూడా గట్టిగానే పోరాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.