కల్యాణ్‌ను తనూజ కమాండ్ చేస్తోందన్న భరణి-ఆ ముగ్గురి మధ్యే టైటిల్ రేస్-ఎవరు గెలిచినా చరిత్రే!
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫైనల్ చేరాలని, టికెట్ టు ఫినాలే పట్టేయాలని హౌస్ మేట్స్ తెగ కష్టపడుతున్నారు. టాస్క్ ల్లో సత్తాచాటుతున్నారు. మరోవైపు ఈ సారి ముగ్గురి మధ్య టైటిల్ రేస్ జరుగుతుందని తెలిసింది.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎండింగ్ కు చేరువవుతోంది. వచ్చే వారమే ఫినాలే వీక్. ఈ నేపథ్యంలో టికెట్ టు ఫినాలే పట్టేయాలని, టాప్-5లో ఉండాలని కంటెస్టెంట్లు తెగ టాస్క్ లు ఆడేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు అరిచేసుకుంటున్నారు. తాజాగా కల్యాణ్ పై భరణి మరోసారి ఫైర్ అయ్యాడు. కల్యాణ్ ను తనూజ కమాండ్ చేస్తుందని అన్నాడు.

కల్యాణ్ వర్సెస్ భరణి
బిగ్ బాస్ 9 తెలుగులో కల్యాణ్ వర్సెస్ భరణి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా హౌస్ లో బాల్ టాస్క్ పెట్టారు. ఇందులో భరణికి సంజన ఎక్కువ బాల్స్ వేసిందని కల్యాణ్ అంటాడు. దీంతో భరణి మళ్లీ కల్యాణ్ పైకి వస్తాడు. చివర్లో కల్యాణ్ ను తనూజ బాగా కమాండ్ చేస్తుందని చెప్తాడు.
బిగ్ బాస్ టాప్-5
పడాల కల్యాణ్ ఇప్పటికే బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఫైనల్ చేరిపోయాడు. ఇక టాప్-5లో నాలుగు స్థానాలు మిగిలాయి. ఇందులో తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయేల్, భరణికి చోటు కన్ఫామ్ అని సమాచారం. ఇక మిగిలిన ఓ ప్లేస్ ను డీమాన్ పవన్ దక్కించుకుంటారని అంటున్నారు. ఇలా చూసుకుంటే సంజన గల్రానీ, సుమన్ శెట్టి టాప్-5 చేరకుండానే హౌస్ నుంచి వెళ్లిపోతారు. ఒకవేళ టాప్-6ను ఫినాలే వీక్ కు ఎంపిక చేస్తే సంజన, సుమన్ లో ఒకరికి ఛాన్స్ దొరుకుతుంది.
టైటిల్ రేస్
బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ రేస్ రసవత్తరంగా మారింది. ఈ సారి ట్రోఫీ కోసం త్రిముఖ పోరు ఉందని అంటున్నారు. పడాల కల్యాణ్, ఇమ్మాన్యుయెల్, తనూజ పుట్టస్వామిలో ఒకరు కచ్చితంగా విజేతగా నిలుస్తారనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. చాలా మంది తనూజానే విన్నర్ అని అంటున్నారు. ఇక కల్యాణ్ కు కూడా ఓటింగ్ లో, సోషల్ మీడియాలో మంచి మద్దతు దొరుకుతుంది. మరోవైపు ఇమ్మాన్యుయెల్ ను విజేత చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయ్యారనే వార్తలొస్తున్నాయి.
కొత్త చరిత్ర
కల్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్ లో ఎవరు గెలిచిన బిగ్ బాస్ లో కొత్త చరిత్ర నమోదవుతుంది. ఒకవేళ కల్యాణ్ గెలిస్తే బిగ్ బాస్ టైటిల్ దక్కించుకున్న తొలి ఆర్మీ జవాన్ అవుతాడు. కల్యాణ్ కాకుండా తనూజ విన్నర్ గా నిలిస్తే.. అప్పుడు బిగ్ బాస్ రెగ్యులర్ సీజన్ ఛాంపియన్ గా నిలిచిన తొలి అమ్మాయి అవుతుంది. వీళ్లిద్దరు కాకుండా ఇమ్మాన్యుయెల్ విక్టరీ సాధించినా హిస్టరీ క్రియేట్ అవుతుంది. బిగ్ బాస్ ట్రోఫీ దక్కించుకున్న తొలి కమెడియన్ గా ఇమ్మాన్యుయెల్ నిలుస్తాడు.














