బిగ్ బాస్‌లో ఫైన‌లిస్ట్ పోరు షురూ-త‌నూజ వ‌ర్సెస్ రీతు గొడ‌వ‌-ఈ వారం డేంజ‌ర్ జోన్లో సీనియ‌ర్ న‌టులు

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో రేస్ టు ఫినాలే స్టార్ట్ అయింది. టాప్-5లో చోటు కోసం కంటెస్టెంట్లు యుద్ధంలోకి దిగారు. మరోవైపు తనూజ, రీతు మధ్య గొడవ జరిగింది. ఇక డేంజర్ జోన్లో ఇద్దరు సీనియర్ నటులున్నారు. 

Published on: Dec 2, 2025, 13:49:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఇప్పటివరకూ ఒక లెక్క.. ఇకపై ఆట మరో లెక్క! ముగింపు దిశగా సాగుతున్న ఈ సీజన్ లో అత్యంత కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఫినాలే రేసు వచ్చేసింది. టాప్-5లో చోటు దక్కించుకోవడం కోసం కంటెస్టెంట్ల మధ్య సమరం ప్రారంభమైంది. ఈ వారం ఇవే టాస్క్ లతో హౌస్ రణరంగంగా మారబోతుంది.

బిగ్ బాస్ 9 తెలుగు (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు (youtube)

బిగ్ బాస్ 9 తెలుగు ఫినాలే

బిగ్ బాస్ 9 తెలుగులో ఇప్పుడు 13వ వారం. హౌస్ లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్లలో నుంచి అయిదుగురు టాప్-5కు వెళ్తారు. ఫైనల్ చేరతారు. ఆ అయిదుగురు ఎవరో నిర్ణయించే పోరు ప్రారంభమైంది. బిగ్ బాస్ హౌస్ లో రేస్ టు ఫినాలే స్టార్ట్ అయింది. హౌస్ మేట్స్ మధ్య పోరు మరో స్థాయికి చేరింది.

తనూజ వర్సెస్ రీతు

రేస్ టు ఫినాలేను బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. అయిదే ముందుగా ఫస్ట్ రౌండ్ లో పోటీపడే ముగ్గురు కంటెస్టెంట్ల పేర్లను చెప్పమన్నాడు బిగ్ బాస్. ఫస్ట్ పవన్, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ అని హౌస్ మేట్స్ డిసైడ్ చేశారు. కానీ ఆ తర్వాత నాకూ ఆడాలని ఉందని రీతు రచ్చ స్టార్ట్ చేస్తుంది. మరి ముందే ఎందుకు చెప్పలేదని తనూజ అంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దగానే అయింది. చివరకు కల్యాణ్, రీతు, ఇమ్మాన్యుయేల్ మధ్య మ్యాథ్స్ టాస్క్ జరిగింది.

బిగ్ బాస్ 9 నామినేషన్స్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో 13వ వారం నామినేషన్లలో ఆరుగురున్నారు. తనూజ పుట్టస్వామి, సంజన గల్రానీ, రీతు చౌదరి, డీమాన్ పవన్, భరణి, సుమన్ శెట్టి ఈ వారం నామినేట్ అయ్యారు. వీళ్లలో నుంచి ఒకరు లేదా ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.

బిగ్ బాస్ ఓటింగ్

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి డబుల్ ఎలిమినేషన్ కూడా చూసే ఛాన్స్ ఉంది. నామినేషన్లలో ఉన్న ఆరుగురి ప్రస్తుతం ఓటింగ్ చూస్తే సీనియర్ నటులు భరణి, సుమన్ శెట్టి డేంజర్ జోన్లో ఉన్నారు. ఎప్పటిలాగే తనూజ ఓటింగ్ లో అదరగొడుతోంది. 31.36 శాతం ఓట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత సంజన (16.59 శాతం) ఉంది. మూడో ప్లేస్ రీతు (16.53 శాతం)ది. నాలుగో స్థానంలో డీమాన్ పవన్ (12.06 శాతం) ఉన్నాడు.

మరోవైపు భరణి, సుమన్ శెట్టి డేంజర్ జోన్లో కొనసాగుతున్నారు. భరణి 11.89 శాతం ఓటింగ్ తో అయిదో స్థానంలో, సుమన్ శెట్టి 11.57 శాతం ఓటింగ్ తో ఆరో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరిలో ఒకరు లేదా ఇద్దరూ ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశముంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More