డీమాన్‌ ప‌వ‌న్ పెళ్లి ఎప్పుడంటే-త‌ల్లి స‌మాధాన‌మిదే-సిగ్గుప‌డ్డ రీతు-ఓటింగ్ డేంజ‌ర్ జోన్లో ఆ ఇద్ద‌రు

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. డీమాన్ పవన్ అమ్మ హౌస్ లోకి వచ్చారు. పవన్ పెళ్లి టాపిక్ వచ్చింది. రీతు సిగ్గుపడటం హైలైట్ గా నిలిచింది. ఓటింగ్ డేంజర్ జోన్లో ఎవరున్నారో కూడా చూసేయండి.  

Nov 19, 2025, 13:50:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో డీమాన్ పవన్, రీతు చౌదరి మధ్య స్పెషల్ బాండ్ ఉందని ఆడియన్స్ అంటున్నారు. రీతు కూడా తన బాండ్ తన ఇష్టమని చెప్పింది. ఈ వారం రీతును పవన్ నామినేట్ చేయడంతో ఏమైనా తేడా కొడుతుందేమో అనిపించింది. కానీ మళ్లీ ఇద్దరు కలిసిపోయారు. ఫ్యామిలీ వీక్ లో బిగ్ బాస్ హౌస్ లోకి పవన్ తల్లి వచ్చారు. ఈ సందర్భంగా పవన్, రీతు కెమిస్ట్రీ వైరల్ గా మారింది.

బిగ్ బాస్ 9 తెలుగు (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు (youtube)

ఫ్యామిలీ వీక్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే డీమాన్ పవన్ తల్లి హౌస్ లోకి చిన్ను అంటూ ఎంట్రీ ఇచ్చారు. అమ్మను చూసి పవన్ ఎమోషనల్ అయ్యాడు. సున్నుండలు తెచ్చి, అందరికీ ఇచ్చారు అమ్మ. కొడుక్కి తన చేత్తో బిర్యానీ తినిపించారు.

పవన్ పెళ్లి

హౌస్ మేట్స్ అందరూ పవన్ అమ్మతో ప్రేమగా మాట్లాడారు. పవన్ పెళ్లి ఎప్పుడు? అని అడిగారు. దీనికి పవన్ కు చాలా మంది అమ్మాయిల ఫాలోయింగ్ ఉందని చెప్పడంతో అందరూ నవ్వేశారు. అప్పుడు రీతు సిగ్గుపడటం వైరల్ గా మారింది. ఆమె వెళ్లేటప్పుడు రీతును హగ్ చేసుకుని వెళ్లారు.

బిగ్ బాస్ 9 ఓటింగ్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ పదకొండో వారంలో ఓటింగ్ ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ సారి తనూజ నామినేషన్లలో లేదు. ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. కల్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, భరణి, డీమాన్ పవన్, సంజన గల్రానీ, దివ్య నిఖిత నామినేట్ అయ్యారు. ఇందులో ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు.

టాప్ లో కల్యాణ్

సాధారణంగా అయితే ఇమ్మాన్యుయేల్ గేమ్ పరంగా, ఎంటర్ టైన్మెంట్ పరంగా అదరగొడుతున్నాడు. అతను కొన్ని వారాల తర్వాత నామినేషన్లలోకి వచ్చాడు. దీంతో ఓటింగ్ లో అతనే టాప్ లో ఉంటాడనిపించింది. కానీ అనూహ్యంగా పడాల కల్యాణ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. తనూజ నామినేషన్లలో లేకపోవడం, ఆమె ఫ్యాన్స్ ఓట్లు కూడా కల్యాణ్ కు పడటమే కారణమని అంటున్నారు.

డేంజర్లో వీళ్లు

పడాల కల్యాణ్ 34.37 శాతం ఓటింగ్ తో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ 25.08 శాతం ఓటింగ్ తో రెండో స్థానంలో ఉన్నాడు. భరణి (15.47 శాతం), డీమాన్ పవన్ (10.45 శాతం) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. సంజన గల్రానీ, దివ్య నిఖిత డేంజర్ జోన్లో ఉన్నారు. సంజన 8.09 ఓటింగ్ శాతంతో అయిదో ప్లేస్ లో, దివ్య నిఖిత 6.53 శాతం ఓటింగ్ తో లాస్ట్ ప్లేస్ లో ఉంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More