బిగ్ బాస్‌లో డ‌బుల్ ఎలిమినేష‌న్‌-ఇవాళ సుమ‌న్ శెట్టి ఔట్‌-ఫైన‌ల్ టాప్ 5 వీళ్లే!

బిగ్ బాస్ 9 తెలుగులో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని తెలిసింది. ఇవాళ హౌస్ నుంచి సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని సమాచారం. అలాగే ఈ సీజన్ టాప్-5 లిస్ట్ పైనా ఓ క్లారిటీ వచ్చేసింది. 

Published on: Dec 13, 2025 5:48 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ ఎండింగ్ కు చేరుకుంది. మరో వారం ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు హౌస్ లో ఏడుగురు ఉన్నారు. ఇందులో అయిదుగురు మాత్రమే ఫినాలేలో ఉంటారు. ఈ నేపథ్యంలో మిగతా ఇద్దరు ఎలిమినేట్ అవాల్సిందే. అయితే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే అంచనాలున్నాయి. ముఖ్యంగా సుమన్ శెట్టి ఇవాళ ఎలిమినేట్ అవుతారన్నది కన్ఫామ్ అని తెలిసింది.

బిగ్ బాస్ 9 తెలుగు (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు (youtube)

సుమన్ శెట్టి ఎలిమినేట్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో సీనియర్ కమెడియన్ సుమన్ శెట్టి జర్నీ ముగిసింది. అతను ఈ రోజు (డిసెంబర్ 13) ఎలిమినేట్ అవుతున్నాడు. ఫినాలేకు ముందు వీకెండ్ లో హౌస్ వదిలి వెళ్లిపోతున్నాడు. బిగ్ బాస్ ఈ సీజన్ ముఖ్యమైన ఫినాలేకు దగ్గర కావడంతో సుమన్ శెట్టి ఎలిమినేట్ తప్పలేదని తెలిసింది. మరోవైపు ఓటింగ్ లో కూడా అతను లాస్ట్ లో ఉన్నాడు.

డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. శనివారం ఒకరు, ఆదివారం ఒకరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ఒకవేళ ఆదివారం ఎలిమినేషన్ లేకపోతే మిడ్ వీక్ లో ఒక కంటెస్టెంట్ ను హౌస్ లో నుంచి పంపించే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పటికే సుమన్ శెట్టి ఎలిమినేషన్ కన్ఫామ్ అయిందని టాక్. ఇక మిగిలిన ఆరుగురిలో భరణి శంకర్ బిగ్ బాస్ జర్నీ కూడా ముగిసిందని తెలిసింది. అతను ఫైనల్ కంటే ముందే ఎలిమినేట్ కాబోతున్నాడని టాక్.

బిగ్ బాస్ టాప్ 5

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ టాప్-5 ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని వారాలుగా ఇదే చర్చ కొనసాగింది. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలుచుకున్న పడాల కల్యాణ్ తో పాటు తనూజ పుట్టస్వామి, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజన టాప్-5లో నిలిచారని తెలిసింది. ఈ లిస్ట్ లో ఇద్దరు కామనర్లు కల్యాణ్, పవన్ ఉండటం విశేషం.

టైటిల్ రేస్

ఈ సీజన్ బిగ్ బాస్ టాప్-5లో కల్యాణ్, ఇమ్మాన్యుయెల్, తనూజ, పవన్, సంజన ఉంటారని అంటున్నారు. అయితే ఈ అయిదుగురిలో టైటిల్ రేస్ మాత్రం ముఖ్యంగా ముగ్గురు మధ్యే ఉండనుంది. ఆ ముగ్గురే కల్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్. ఈ ముగ్గురిలోనే ఒకరు టైటిల్ సొంతం చేసుకునే అవకాశం ఉందని సోషల్ మీడియాలో, రివ్యూల్లో తెగ చెప్పేస్తున్నారు. మరి ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.