రీతు ఎలిమినేట్! మారిన బిగ్ బాస్ లెక్కలు.. టాప్-5 రేసు రివర్స్.. ఆ నలుగురు ఎవరు?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. టాప్-5 ఎవరు? అనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కల్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు, మరి ఇంకా నలుగురు ఎవరన్నది చూడాలి. 

Dec 7, 2025, 17:22:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బిగ్ బాస్ 9 తెలుగు ఎండింగ్ దిశగా సాగుతోంది. ఈ సీజన్ లో ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలాయి. ఇప్పటికే పడాల కల్యాణ్ ఫైనల్లో చోటు కొట్టేశాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఇవాళ (డిసెంబర్ 7) బిగ్ బాస్ హౌస్ నుంచి రీతు చౌదరి ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. ఈ అనూహ్యమైన ఎలిమినేషన్ తో బిగ్ బాస్ టాప్-5 లెక్కలు మారాయనే చెప్పొచ్చు.

బిగ్ బాస్ 9 తెలుగు (youtube)
బిగ్ బాస్ 9 తెలుగు (youtube)

రీతు ఎలిమినేట్

బిగ్ బాస్ 9 తెలుగులో హాట్ బ్యూటీ రీతు చౌదరి ప్రయాణం ముగిసింది. ఈ భామ 13వ వారంలో లగేజీ ప్యాక్ చేసుకుని వెళ్లిపోయింది. ఆదివారం రీతు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. దీంతో టాప్-5 చేరకుండానే బిగ్ బాస్ హౌస్ లో రీతు జర్నీకి ఎండ్ స్టాప్ వచ్చేసింది. ఓ వైపు టాస్క్ లు, మరోవైపు డీమాన్ పవన్ తో రిలేషన్.. ఇలా హౌస్ లో బాగానే ఎంటర్ టైన్ చేసింది రీతు.

టాప్-5 రేసు

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నుంచి రీతు ఎలిమినేషన్ తో టాప్-5 రేసు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. టాప్-5లో రీతు కూడా ఉంటుందనే కామెంట్లు వినిపించాయి. కానీ ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టాప్-5లో నిలిచేవాళ్లు ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హౌస్ లో మిగిలింది ఏడుగురు. ఇందులో కల్యాణ్ ఇప్పటికే ఫైనల్ టికెట్ దక్కించుకున్నాడు.

ఆరుగురిలో

బిగ్ బాస్ హౌస్ లో రీతు ఎలిమినేషన్ తో ఏడుగురు మిగిలారు. తనూజ పుట్టస్వామి, పడాల కల్యాణ్, డీమాన్ పవన్, భరణి శంకర్, సుమన్ శెట్టి, సంజన గల్రానీ, ఇమ్మాన్యుయేల్ ఉన్నారు. వీళ్లలో పడాల కల్యాణ్ అల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. టాస్క్ ల్లో అదరగొట్టి ఫైనల్ చేరిపోయాడు. ఇక మిగిలిన నాలుగు ప్లేస్ ల గురించి ఆరుగురు పోటీపడుతున్నారు. ఇందులో ఇమ్మాన్యుయేల్, తనూజ కచ్చితంగా టాప్-5 చేరతారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

డబుల్ ఎలిమినేషన్

బిగ్ బాస్ బజ్ ప్రకారం చూసుకుంటే పడాల కల్యాణ్ తో పాటు ఇమ్మాన్యుయేల్, తనూజ కచ్చితంగా ఫినాలే వరకూ వెళ్తారని టాక్. ఇక మిగిలింది రెండు స్థానాలు. ఇందుకోసం సంజన గల్రానీ, సుమన్ శెట్టి, భరణి శంకర్, డీమాన్ పవన్ మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది.

ఈ నలుగురిలో నుంచి ఏ రకంగా చూసుకున్నా భరణి శంకర్, డీమాన్ పవన్ ముందుకు వెళ్లారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదా సంజన, సుమన్ కూడా టాప్-5లో ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. వచ్చే వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. మరి ఇంటికి ఎవరు వెళ్తారో? ఫినాలే ఎవరు చేరతారో? చూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More