Bigg Boss Agnipariksha 2 Elimination: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2' షో ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 10 హౌజ్‌లోకి అడుగుపెట్టేందుకు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు.
ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్లు, ట్విస్టులు

రోజురోజుకూ పెరుగుతున్న వివాదాలు, కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలతో ఈ తెలుగు రియాలిటీ ఓటీటీ షో మంచి వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంటోంది. మరో రెండు రోజుల్లో ఈ షో షూటింగ్ పూర్తి కానుండగా, ఇంట్రెస్టింగ్ ఎలిమినేషన్ ట్విస్టులు బయటకు వచ్చాయి.
గాయత్రీ ఎలిమినేషన్.. ఓట్లు వేస్తే వేస్టే!
ఇప్పటికే టాప్ 15 కంటెస్టెంట్ల కోసం ఓటింగ్ లైన్లు తెరిచారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం గాయత్రీ ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎపిసోడ్‌లో వచ్చిన ఎల్లో కార్డుతో పాటు జడ్జిలు కూడా మరొక ఎల్లో కార్డు ఇవ్వడంతో ఆమె నిష్క్రమణ ఖాయమైంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
ఈ ఎపిసోడ్ జియో హాట్‌స్టార్‌లో ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ కాకపోవడంతో యాప్‌లో ఆమె ఓటింగ్ లైన్లు తెరిచే ఉన్నాయి. గాయత్రీకి ఓట్లు వేసి ఓటును వేస్ట్ చేసుకోవద్దని విశ్లేషకులు సూచిస్తున్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న భాగీ తుళ్లూరు!
నెల్లూరు యాస, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన భాగీ తుళ్లూరు కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 నుంచి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో అడుగుపెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తన జుట్టును కూడా కత్తిరించుకుని బేబీ కట్ చేయించుకున్నారు.
ఏడ్చేసిన భాగీ తుళ్లూరు
టాస్కుల్లో నూటికి నూరు శాతం ప్రతిభ చూపించినప్పటికీ చివరి ఘట్టంలో ఎలిమినేట్ కావడంతో భాగీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "షో కోసం జుట్టు కత్తిరించుకున్నాను, టాస్కుల్లో వంద శాతం కష్టపడ్డాను, మరో రెండు రోజులు ఉంటే బిగ్ బాస్ 10 స్టేజ్ పైన ఉండేదాన్ని" అని భాగీ తుళ్లూరు సెట్‌లోనే బోరున ఏడ్చేసినట్లు సమాచారం.
రేసులో 13 మంది కంటెస్టెంట్లు
{{/usCountry}}టాస్కుల్లో నూటికి నూరు శాతం ప్రతిభ చూపించినప్పటికీ చివరి ఘట్టంలో ఎలిమినేట్ కావడంతో భాగీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. "షో కోసం జుట్టు కత్తిరించుకున్నాను, టాస్కుల్లో వంద శాతం కష్టపడ్డాను, మరో రెండు రోజులు ఉంటే బిగ్ బాస్ 10 స్టేజ్ పైన ఉండేదాన్ని" అని భాగీ తుళ్లూరు సెట్‌లోనే బోరున ఏడ్చేసినట్లు సమాచారం.
రేసులో 13 మంది కంటెస్టెంట్లు
{{/usCountry}}భాగీ, గాయత్రీ నిష్క్రమణతో ప్రస్తుతం రేసులో 13 మంది కంటెస్టెంట్లు మిగిలారు. మిగిలిన రెండు రోజుల చిత్రీకరణలో కేవలం 10 మంది మాత్రమే బిగ్ బాస్ 10 తెలుగుకు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చరణ్‌కు భారీ ఓటింగ్.. కానీ ప్రమాదంలోనే!
కంటెస్టెంట్ చరణ్‌కు ఓటింగ్ భారీ స్థాయిలో నమోదు అవుతున్నప్పటికీ, గేమ్ పరంగా అతని ప్రదర్శన ఆశాజనకంగా లేదు. పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే జడ్జిలు ఏ క్షణమైనా అతడిని ఎలిమినేట్ చేసే ప్రమాదం పొంచి ఉందని ప్రచారం సాగుతోంది. చివరి రెండు రోజుల్లో జరగబోయే షూటింగ్‌తో 'బిగ్ బాస్ తెలుగు 10'లోకి అడుగుపెట్టే ఆ టాప్ 10 కంటెస్టెంట్లు ఎవరో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.
బిగ్ బాస్ తెలుగు 10 వివరాలు
కాగా, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి జడ్జ్‌లుగా అభిజీత్, నవదీప్, బిందు మాధవి వ్యవహరిస్తుండగా.. యాంకర్‌గా శ్రీముఖి చేస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు 10కు హోస్ట్‌గా టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.