బిగ్ బాస్ 18, 'ది 50' ఓటీటీ రియాలిటీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రజత్ దలాల్ తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న రజత్ దలాల్ ఆదివారం (మార్చి 29) తన గర్ల్‌ఫ్రెండ్‌ను వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను రజత్ దలాల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
కలల సుందరితో కొత్త ప్రయాణం

ఇన్‌స్టాగ్రామ్‌లో రజత్ షేర్ చేసిన ఫోటోలలో ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపిస్తోంది. ఒక ఫోటోలో రజత్ తన భార్య చేతిని పట్టుకుని మురిసిపోతుండగా, మరో ఫోటోలో ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ రొమాంటిక్ పోజులిచ్చారు. ఇక పూలమాలలు మార్చుకున్న సమయంలో రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగుల్లో రజత్ వివాహ వేదిక మెరిసిపోయింది.
"జీవితంలో ఒక కొత్త దశను ప్రారంభిస్తున్నాను" అని హిందీలో రాస్తూ ఈ మధుర క్షణాలను రజత్ దలాల్ పోస్ట్ చేశారు. అయితే తన భార్య పేరును గానీ, ఆమె పూర్తి వివరాలను గానీ ఆయన ఎక్కడా వెల్లడించలేదు. అంటే, పెళ్లి తర్వాత కూడా తన గర్ల్‌ఫ్రెండ్ వివరాలను సస్పెన్స్‌గా ఉంచారు బిగ్ బాస్ స్టార్ రజత్ దలాల్.
అందరి ఆశీస్సులు కావాలి: రజత్
పెళ్లికి ముందు రజత్ దలాల్ ఒక ఎమోషనల్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. "నా జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం మొదలవుతోంది. మీరంతా నన్ను ఎంతగానో ప్రేమించారు, సపోర్ట్ చేశారు.. అందుకే ఈ స్థాయికి రాగలిగాను. నా చిన్న తమ్ముళ్లు, అన్నలు.. అందరూ నన్ను దీవించండి" అని రజత్ దలాల్ కోరారు.
శుభాకాంక్షల వెల్లువ
రజత్ వివాహ వార్త తెలిసిన వెంటనే 'ది 50' షోలో ఆయనతో కలిసి నటించిన సహచరులు శుభాకాంక్షలు కురిపించారు. ఫైజల్ షేక్ (మిస్టర్ ఫైజు) స్పందిస్తూ "తమ్ముడూ.. నీకు చాలా చాలా అభినందనలు" అని కామెంట్ చేయగా, శ్రుతికా అర్జున్ "మా అన్నయ్యకు పెళ్లి శుభాకాంక్షలు. నిన్న రాత్రి మేము వదినతో మాట్లాడాము, ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమెను బాగా చూసుకో" అని సరదాగా కామెంట్ చేశారు.
{{/usCountry}}రజత్ వివాహ వార్త తెలిసిన వెంటనే 'ది 50' షోలో ఆయనతో కలిసి నటించిన సహచరులు శుభాకాంక్షలు కురిపించారు. ఫైజల్ షేక్ (మిస్టర్ ఫైజు) స్పందిస్తూ "తమ్ముడూ.. నీకు చాలా చాలా అభినందనలు" అని కామెంట్ చేయగా, శ్రుతికా అర్జున్ "మా అన్నయ్యకు పెళ్లి శుభాకాంక్షలు. నిన్న రాత్రి మేము వదినతో మాట్లాడాము, ఆమె చాలా మంచి వ్యక్తి. ఆమెను బాగా చూసుకో" అని సరదాగా కామెంట్ చేశారు.
{{/usCountry}}బాలీవుడ్ బ్యూటీలు నిక్కీ తంబోలి, ఉర్వశి ధోలాకియా, కాశిష్ కపూర్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ నూతన దంపతులపై ప్రేమను కురిపించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఒక సీరియస్ రిలేషన్‌లో ఉన్నానని, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానని రజత్ దలాల్ హింట్ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఇప్పుడు ఆమె మెడలో మూడు ముళ్లు వేసి తన జీవిత భాగస్వామిని చేసుకున్నారు.
'ది 50' లో రజత్ ప్రస్థానం
ఇకపోతే ఇటీవలే ముగిసిన 'ది 50' ఓటీటీ రియాలిటీ షోలో రజత్ దలాల్ అత్యంత బలమైన కంటెస్టెంట్‌గా నిలిచారు. టాస్క్‌లు గెలవడమే కాకుండా, ప్రత్యర్థులను ఎలిమినేట్ చేసే వ్యూహాల్లోనూ ఆయన ముందున్నారు. సెమీ ఫైనల్ వరకు చేరుకున్న రజత్.. ఫైనల్ టాస్క్‌కు ముందు శివ్ ఠాక్రే, కృష్ణా ష్రాఫ్ చేతిలో ఓడిపోయారు. కాగా, ఈ షో టైటిల్‌ను ఫైజల్ షేక్‌ను ఓడించి శివ్ ఠాక్రే గెలుచుకున్న సంగతి తెలిసిందే.