...
...
Next Story

Arjun Ambati: వారి సినిమాల టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న రోజుల నుంచి ఇక్కడి దాకా.. బిగ్ బాస్ అర్జున్ అంబటి కామెంట్స్

Bigg Boss Arjun Ambati Speech In Paramapada Sopanam Pre Release Event: బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా తెరకెక్కిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పరమపద సోపానం. ఇటీవల పరమపద సోపానం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ అర్జున్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 23, 2026, 09:37:44 IST
Advertisement

Bigg Boss Arjun Ambati Paramapada Sopanam Pre Release Event: బిగ్ బాస్ అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు.

హీరోయిన్‌గా జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్

వారి సినిమాల టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న రోజుల నుంచి ఇక్కడి దాకా.. బిగ్ బాస్ అర్జున్ అంబటి కామెంట్స్
వారి సినిమాల టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న రోజుల నుంచి ఇక్కడి దాకా.. బిగ్ బాస్ అర్జున్ అంబటి కామెంట్స్

తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా.. పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్ కథానాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పరమపద సోపానం సినిమా ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో మంగళవారం (ఏప్రిల్ 21) నాడు పరమపద సోపానం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే, ఈవెంట్‌లో బిగ్ బాస్ అంబటి అర్జున్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అర్జున్ అంబటి స్పీచ్

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ .. "లెజెండరీ డైరెక్టర్స్ భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర గారు మా ‘పరమపద సోపానం’ ఈవెంట్‌కి రావడం ఆనందంగా ఉంది. ఈ దర్శకులు తీసిన సినిమాల టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న రోజుల నుంచి ఈ రోజు నా సినిమాకు వాళ్లు గెస్టులుగా రావడం ఆనందంగా ఉంది" అని అన్నాడు.

ప్రముఖ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ .. "ప్రసన్న ఈ ‘పరమపద సోపానం’ చిత్రం గురించి నాకు చెప్పారు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అవుతానని ప్రసన్న నా దగ్గరకు వచ్చాడు. ఓ మూవీకి కూడా పని చేశాడు. దర్శకుడిగా కంటే ప్రొడక్షన్ సైడ్ వెళ్తే, ప్రొడక్షన్ మేనేజర్‌గా వెళ్తే బాగుంటుందని సలహా ఇచ్చాను. ఇప్పుడు మంచి స్థాయిలోకి వచ్చాడు" అని తెలిపారు.

"ఈ చిత్రంతో కొత్త వారు తెరకు పరిచయం కాబోతోన్నారు. నాగ శివ గారికి మంచి విజయం దక్కాలి. అర్జున్, జెన్నీఫర్‌లకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు అన్నారు.

అచ్చ తెలుగులో టైటిల్

ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. "అచ్చ తెలుగులో ‘పరమపద సోపానం’ అని టైటిల్ పెట్టారు. ప్రసన్నతో నాకెన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. నాగ శివ తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని ఆకాంక్షించారు.

"అర్జున్ లుక్స్, యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అర్జున్ పెద్ద హీరో అవుతాడు. జెన్నిఫర్‌కి తెలుగులో మంచి భవిష్యత్తు ఉండాలి. దేవ్ గారు మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జనాలు ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ సముద్ర కోరారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks