...
...
Next Story

Ashu Reddy Bharath Kanth: హీరో భరత్ కాంత్ దుర్మరణం- అషు రెడ్డి కన్నీళ్లు- నా సర్వస్వం, చీకటి రోజు ఎమోషనల్ పోస్ట్!

Ashu Reddy Emotional Post On Bharath Kanth Death: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో భరత్ కాంత్ (31) కన్నుమూశారు. తన ప్రాణ స్నేహితుడి మరణవార్త విని బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భరత్‌తో దిగిన ఫొటోలను షేర్ చేసిన అషు రెడ్డి ఎమోషల్ అయ్యారు.

Published on: May 11, 2026, 16:03:07 IST
Advertisement

Ashu Reddy Emotional Post On Bharath Kanth Death: హైదరాబాద్ నగర శివార్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకెళ్లే వాహనాలకు నిలయమైన ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఒక యువ హీరోను బలితీసుకుంది. మే 10వ తేదీ రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యంగ్ హీరో భరత్ కాంత్ (31) మరణించారు. ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియా సెలబ్రిటీల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది.

రక్తం చిందిన ఔటర్ రింగ్ రోడ్డు

హీరో భరత్ కాంత్ దుర్మరణం- అషు రెడ్డి కన్నీళ్లు- నా సర్వస్వం, చీకటి రోజు ఎమోషనల్ పోస్ట్!
హీరో భరత్ కాంత్ దుర్మరణం- అషు రెడ్డి కన్నీళ్లు- నా సర్వస్వం, చీకటి రోజు ఎమోషనల్ పోస్ట్!

ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 12 వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో భరత్ కాంత్ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దాంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

ఈ ఘటనలో హీరో భరత్ కాంత్‌తో పాటు కారులో ఉన్న యూట్యూబర్ జి. సాయి త్రిలోక్ కూడా ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అషు రెడ్డి కన్నీటి వీడ్కోలు

భరత్ కాంత్ మరణవార్త విన్న నటి, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి ఎమోషనల్ అయ్యారు. భరత్ ఆమెకు కేవలం స్నేహితుడు మాత్రమే కాదు, ఆమె జీవితంలో అత్యంత సన్నిహితుడని అషు రెడ్డి బాధపడారు. "ఇది నా వ్యక్తిగత నష్టం. నా బెస్ట్ ఫ్రెండ్, నా ఎమర్జెన్సీ కాంటాక్ట్, నా ఫ్యామిలీ, నా సర్వస్వం ఇప్పుడు శివయ్య దగ్గరికి వెళ్లిపోయారు" అని అషు రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం 31 ఏళ్ల వయసులోనే భరత్ కాంత్ హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో వచ్చిన 'గ్రామం' సినిమాతో పాటు, 2024లో విడుదలైన 'టెనెంట్' (Tenant) చిత్రంలో భరత్ కాంత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. వెండితెరపైనే కాకుండా డిజిటల్ మాధ్యమంలోనూ ఆయన చురుగ్గా ఉండేవారు.

యూట్యూబ్ వెబ్ సిరీసులు

ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన 'గీతాంజలి', 'పార్వతీ పరమేశ్వరులు' వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా భరత్ కాంత్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న తరుణంలో ఇలా రోడ్డు ప్రమాదంలో భరత్ కాంత్ మరణించడం చాలా విచారకరం.

భరత్ కాంత్ మృతిపై అషు రెడ్డి పోస్ట్

అషు రెడ్డి సందేశం

జీవితం ఒక్క క్షణంలో ఎలా మారిపోతుందో చెబుతూ.. "ఒక ఫోన్ కాల్, ఒక అనూహ్య క్షణం మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఏదీ శాశ్వతం కాదు, అందుకే ఉన్నప్పుడే ప్రేమించండి" అంటూ అషు రెడ్డి పెట్టిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe