Divi: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బిగ్ బాస్ బ్యూటీ దివి.. క్యాస్ట్ మూవీ నుంచి పవర్ పుల్ లుక్.. పోస్టర్ వైరల్

Divi: ఓ వైపు సినిమాల్లో యాక్టింగ్ తో, మరోవైపు సోషల్ మీడియాలో అందాలతో అదరగొట్టే దివి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ బిగ్ బాస్ బ్యూటీ నటిస్తున్న కొత్త మూవీ ‘క్యాస్ట్’ నుంచి రిలీజ్ చేసిన ఆమె పోస్టర్ వైరల్ గా మారింది. దివి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన లుక్ అదిరిపోయింది.  

Published on: Apr 25, 2026, 12:03:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Divi: విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ, నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా బిగ్ బాస్ బ్యూటీ దివి సాగిపోతోంది. తాజాగా ఆమె నటిస్తున్న ‘క్యాస్ట్’ మూవీ నుంచి దివి ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

దివి ఫస్ట్ లుక్ (x/GoldenProdns)
దివి ఫస్ట్ లుక్ (x/GoldenProdns)

దివి ఫస్ట్ లుక్

కుల వ్యవస్థ, సమాజంలో కులం పేరుతో జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టే విధంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘క్యాస్ట్’. ఇందులో దివి ఓ హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ (ఏప్రిల్ 25) దివి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె పవర్ ఫుల్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

పెద్ద బొట్టుతో

పెద్ద బొట్టుతో, మెడలో పులి గోర్లతో ఆమె రూపం భయపెట్టేలా ఉంది. క్యాస్ట్ సినిమాలో ఆమె ధూమవతి క్యారెక్టర్ ప్లే చేస్తుందని కూడా అనౌన్స్ చేశారు. ‘‘టాలెంటెడ్ నటి దివికి క్యాస్ట్ మూవీ టీమ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. క్యాస్ట్ సినిమాలో ధూమవతిగా ఆమె భయంకరమైన అవతారాన్ని చూసేందుకు రెడీ అయిపోండి. ఈ లుక్ చాలా కాలం గుర్తుండిపోతుంది’’ అని మేకర్స్ ఎక్స్ లో పోస్టు చేశారు.

నలుగురు హీరోలు

కులం కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘క్యాస్ట్’ మూవీలో నలుగురు హీరోలుగా నటిస్తున్నారు. వరుణ్ సందేశ్, సత్యం రాజేష్, గగన్, యాంకర్ రవి ఇందులో లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో నాలుగు సింహాలను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే కులాలుగా చూపించారు. ఈ సినిమాకు ఏకే జంపన్న డైరెక్టర్.

నాగబాబు లుక్

‘క్యాస్ట్’ మూవీలో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అతను రంగరాజన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. స్వామి మాలలో సీరియస్ లుక్ లో ఉన్న నాగబాబు పోస్టర్ ను కూడా ఇప్పటికే రిలీజ్ చేశారు. సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను, కుల వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపేలా ఈ సినిమా ఉండబోతుందని తెలిసింది.

గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ‘క్యాస్ట్’ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశముంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More