Divi Bold Photos: అన్నీ చూసే కదా తీసుకుంటున్నారు.. బోల్డ్ ఫోటోలపై బిగ్ బాస్ దివి సంచలన వ్యాఖ్యలు.. ఫిట్ గా ఉన్నానంటూ!
Divi Bold Photos: బిగ్ బాస్ ఫేమ్ దివి తన హాట్ ఫోటోషూట్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. డైరెక్టర్లకు తన గ్లామర్ తెలియజేయడానికే బోల్డ్ ఫోటోలు పెడుతున్నానని ఆమె వెల్లడించింది. దివి సంచలన కామెంట్లపై ఓ లుక్కేయండి.
బిగ్ బాస్ తో పాపులరైన అందాల భామ దివి ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయింది. ఓ వైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు కీలక పాత్రలు కూడా పోషిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో హీట్ పెంచేస్తోంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో బోల్డ్ ఫొటోలపై దివి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

బోల్డ్ కాదన్న దివి
తెలుగమ్మాయి దివి బోల్డ్ ఫొటోలతో సోషల్ మీడియాలో మంట పుట్టిస్తూనే ఉంటుంది. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో బోల్డ్ ఫొటోలు ఎందుకు పోస్టు చేస్తారని హోస్ట్ ప్రశ్నించారు. దీనికి దివి ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. ‘‘అది బోల్డ్ కాదు. ఒక నటిగా నేను గ్లామరస్ గా, అందంగా కనిపించాలని అనుకుంటా. యాక్టింగ్ స్కిల్స్ ఉండాలని కోరుకుంటా’’ అని దివి చెప్పింది.
అన్నీ చూసే కదా
బోల్డ్ ఫొటోలు పోస్టు చేయడంపై మాట్లాడుతూ దివి సంచలన కామెంట్లు చేసింది. ‘‘మన వాళ్లు ‘అన్నీ చూసే’ కదా తీసుకుంటున్నారు. నేను కూడా బాగున్నా. ఏ రకరమైన బట్టలు వేసుకునేందుకైనా రెడీగా ఉన్నా అని డైరెక్టర్లకు తెలియాలి కదా. అప్పుడే అలాంటి రోల్స్ వస్తాయి. నేను ఇంత ఫిట్ గా ఉన్నా. మరి ఈ ఫొటోలు పోస్టు చేస్తేనే కదా నేను ఎంత అందంగా ఉన్నానోనని జనాలు చూస్తారు’’ అని దివి తెలిపింది.
హాట్ ఫొటోలు
తెలుగమ్మాయి దివి సోషల్ మీడియాలో హాట్ పోజులతో రెచ్చిపోతూనే ఉంటుంది. బీచ్ లో బికినీలో ఉన్న ఆమె పిక్స్ అయితే ఇంటర్నెట్ ను షేక్ చేశాయి. ఓ వైపు పద్ధతిగా చీరకట్టులో ఫొటోలు పెడుతూనే, మరోవైపు హద్దులు దాటిన గ్లామర్ షోను కూడా దివి ప్రదర్శిస్తోంది.
హారర్ థ్రిల్లర్ తో
రీసెంట్ గా తెలుగు హారర్ థ్రిల్లర్ ‘హనీ’ మూవీతో ఆడియన్స్ ను దివి ఎంటర్ టైన్ చేసింది. ఈ సినిమాలో నవీన్ చంద్ర హీరో. పిల్లి మాయ కాన్సెప్ట్ చూట్టూ ఈ మూవీ కథ సాగుతుంది. హిందీ మూవీ ‘జాట్’లోనూ దివి కీలక పాత్ర పోషించింది.
బిగ్ బాస్ 4
తెలుగు బిగ్ బాజ్ 4 సీజన్ లో దివి పాల్గొంది. ఈ రియాలిటీ షోలో అందంతో, మాటలతో అలరించింది. 49 రోజుల పాటు హౌస్ లో ఉంది. బయటకు వచ్చాక సినిమాలతో బిజీ అయిపోయింది. చిరంజీవి హీరోగా వచ్చిన ‘గాడ్ ఫాదర్’లో కీలక పాత్ర పోషించింది. ‘లంబసింగి’, ‘సింబా’ లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


